తెలంగాణ కేబినెట్‌ భేటీ.. సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయాలు..

By అంజి  Published on  14 March 2020 9:49 PM IST
తెలంగాణ కేబినెట్‌ భేటీ.. సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయాలు..

ముఖ్యాంశాలు

  • కరోనాపై సీఎం కేసీఆర్‌ కంట్రోలింగ్‌ చర్యలు
  • కరోనా వైరస్‌పై ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికైనా సిద్ధం- కేసీఆర్‌
  • కరోనాను కట్టడి చేయడమే లక్ష్యంగా ముందస్తు జాగ్రత్తలు

హైదరాబాద్‌: తెలంగాణ కేబినెట్‌ సమావేశం ముగిసింది. దాదాపు మూడు గంటలకుపైగా ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం జరిగింది. తెలంగాణలో కరోనాపై భయంకరమైన పరిస్థితులు మాత్రం లేవన్నారు. కరోనాపై ప్రజలెవరూ భయాందోళన చెందాల్సిన అవసం లేదన్నారు. కరోనా వైరస్‌ మన దేశంలో పుట్టిన వ్యాధి కాదని సీఎం కేసీఆర్‌ అన్నారు. బెంగళూరు నుంచి వచ్చిన వ్యక్తి కరోనా తొలిగిపోయిందన్నారు. బాధితుడికి చికిత్స ఇచ్చి నయం తర్వాత డిశ్చార్జ్‌ అయ్యాడన్నారు.

ఇప్పుడు చికిత్స పొందుతున్న వారిలో కరోనా అనుమానిత లక్షణాలు మాత్రమే ఉన్నాయన్నారు. మన దేశంలో కరోనా కారణంగా ఇప్పటి వరకు ఇద్దరు మాత్రమే చినపోయారని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. దేశంలో 83 మందికి కరోనా వచ్చింది.. వీరంతా విదేశాల నుంచి వచ్చిన వారేనని అన్నారు. ఈ వైరస్‌ ఒక వ్యక్తి నుంచి చాలా మందికి వ్యాప్తి చెందే ప్రమాదం ఉందన్నారు.

ముందు జాగ్రత్తలు తీసుకుంటే కరోనా వైరస్‌ను నివారించవచ్చని సీఎం కేసీఆర్‌ అన్నారు. కరోనా వైరస్‌ అందరూ భయపడేంత పెద్ద ఉత్పాతం కాదన్నారు. 135 కోట్లు ఉన్న దేశ జనాభాలో ఇప్పటి వరకు 83 మందికి మాత్రమే కరోనా సోకిందన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టిందన్నారు.

కరోనా వైరస్‌పై ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. కరోనా నియంత్రణకు రూ.500 కోట్లు మంజూరు చేస్తామన్నారు. ఎయిర్‌పో ర్టులో 200 మంది అధికారులు స్క్రీనింగ్‌ చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,020 బెడ్లు ఏర్పాటు చేశామన్నారు. 240 వెంటిలేటర్లు సిద్ధంగా ఉంచామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వ్యాప్తికి తక్కువ అవకాశాలు ఉన్నాయని సీఎం కేసీఆర్‌ వివరించారు. కరోనా నియంత్రణకు రెండు దశల్లో కార్యక్రమాలు చేపడతామన్నారు. 15 రోజుల్లోగా.. వారం రోజుల యాక్షన్‌ ప్లాన్‌తో ముందుకెళ్తామన్నారు సీఎం కేసీఆర్‌. విద్యా సంస్థలు తెరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని కేసీఆర్‌ అన్నారు. అయితే షెడ్యూల్స్‌ ప్రకారం అన్ని పరీక్షలను కొనసాగిస్తామని తెలిపారు. పరీక్షలు పూర్తయ్యేవరకు రెసిడెన్షియల్స్‌లో వసతి కొనసాగుతుందన్నారు.

ఫంక్షన్‌ హాల్స్‌ కూడా మూసివేయాలని కేబినెట్‌ సమావేశంలో నిర్ణయించామన్నారు. ఇప్పటికే నిర్ణయమైన పెళ్లిళ్లకు ఎలాంటి ఆటంకాలు లేవన్నారు. నాలుగు క్వారంటైన్డ్‌ ఆస్పత్రులను సిద్ధంగా ఉంచామని తెలిపారు.

ఫంక్షన్‌ హాల్స్‌ కూడా మూసివేయాలని కేబినెట్‌ సమావేశంలో నిర్ణయించామన్నారు. ఇప్పటికే నిర్ణయమైన పెళ్లిళ్లకు ఎలాంటి ఆటంకాలు లేవన్నారు. నాలుగు క్వారంటైన్డ్‌ ఆస్పత్రులను సిద్ధంగా ఉంచామని తెలిపారు. బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలను నిషేధిస్తున్నామన్నారు. ఇండోర్‌, అవుట్‌డోర్‌, స్విమ్మింగ్‌ ఫూల్స్‌, పార్కులు మూసివేయాలన్నారు. అయితే మాల్స్‌, సూపర్‌ మార్కెట్లను మాత్రం మూసివేయడం లేదని తెలిపారు. సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం చూస్తూ ఉరుకోదన్నారు.

Next Story