రేపు సాయంత్రం తెలంగాణ కేబినేట్ భేటీ
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 9 Oct 2020 11:09 AM GMTతెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గం శనివారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం కానుంది. ఈ సమావేశంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన చట్టసవరణ బిల్లులను ఆమోదించే అవకాశం ఉంది. యాసంగిలో నిర్ణీత పంటల సాగు విధానం అమలు, గ్రామాల్లోనే పంట కొనుగోలు అంశాలపై సమీక్ష నిర్వహించనున్నారు. రేపు రెండున్నర గంటలకు ఈ సమీక్ష జరగనుంది. వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ మంత్రులు, సీనియర్ అధికారులు ఈ సమీక్షలో పాల్గొంటారు. యాసంగిలో ఏ పంట వేయాలి..? ఏ పంట వేయొద్దు..? ఏ పంట వేస్తే కలిగే లాభనష్టాలు వంటి విషయాలపై.. సీఎం అధికారులతో చర్చించనున్నారు. రాష్ట్రంలో మక్కల సాగుపై సమీక్ష జరపనున్నారు.
కరోనా నేపథ్యంలో గత యాసంగి పంటలను గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సేకరించడం జరిగింది. ఇంకా కరోనా ముప్పు తొలగలేదు అందుకే వర్షా కాలం పంటలను కూడా గ్రామాల్లోనే కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేయాలనే దానిపై చర్చించనున్నారు. 6 వేల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు జరపాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. పంటలు కొనుగోలు చేసిన తర్వాత వీలైనంత తక్కువ సమయంలో రైతులకు డబ్బులు చెల్లించాలి. దీని కోసం కావాల్సిన అన్ని ఏర్పాట్లను ముందుగానే చేయాలని సూచించారు.