తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కరోనా లెక్కలు

By సుభాష్  Published on  15 Sept 2020 9:10 AM IST
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కరోనా లెక్కలు

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో చర్యలు చేపట్టింది. అయినా పాజిటివ్‌ కేసులు ఏ మాత్రం ఆగడం లేదు. ఒక రోజు తగ్గినా.. మరొక రోజు పెరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పరీక్షల సంఖ్య కూడా పెంచింది ప్రభుత్వం. గతంలో హైదరాబాద్‌తోపాటు జిల్లా కేంద్రాల్లో మాత్రమే కరోనా పరీక్షలు చేసేవారు. ప్రస్తుతం మండల కేంద్రాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో ప్రజలకు మరింత సునాయాసంగా మారింది. గడిచిన 24 గంటల్లో నమోదైన పాజిటివ్‌ కేసుల గురించి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

► గడిచిన 24 గంటల్లో - 2,058 పాజిటివ్‌ కేసులు

► గడిచిన 24 గంటల్లో మరణాలు - 10

► రాష్ట్రంలో మొత్తం కేసులు - 1,60,571

► మొత్తం మరణాల సంఖ్య - 984

► గడిచిన 24 గంటల్లో కోలుకున్న వారు - 2,180

► రాష్ట్రంలో మొత్తం కోలుకున్న వారు - 1,29,187

► రాష్ట్రంలో మొత్తం యాక్టివ్‌ కేసులు - 30,400

► హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నవారు - 23,534

► రాష్ట్రంలో మరణాల రేటు - 0.61శాతం

► దేశంలో మరణాల రేటు - 1.64 శాతం

► రాష్ట్రంలో కోలుకున్న వారి రేటు - 80.45 శాతం

► దేశంలో కోలుకున్నవారి రేటు - 78.26శాతం

► 10 లక్షల జనాభాకు చేసిన నిర్ధారణ పరీక్షల సంఖ్య - 59,811

► రావాల్సిన రిపోర్టుల సంఖ్య - 908

గడిచిన 24 గంటల్లో అత్యధికంగా నమోదైన పాజిటివ్‌ కేసుల ప్రాంతాలు

► జీహెచ్‌ఎంసీలో - 277

► రంగారెడ్డి - 143

► కరీంనగర్‌ - 135

► వరంగల్‌ అర్బన్‌ - 108

► సిద్దిపేట - 106

► ఖమ్మం - 103

కాగా, మిగతా జిల్లాల్లో వంద లోపు పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Next Story