తెలంగాణలో లక్షా 50వేలు దాటిన కరోనా కేసులు
By సుభాష్ Published on 10 Sep 2020 3:48 AM GMTతెలంగాణలో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు పాజిటివ్ కేసులు లక్షా 50వేల 176కు చేరింది. గడిచిన 24 గంటల్లో 2,534 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 11 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మరణాల సంఖ్య 927కు చేరింది. ఇక కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,17,143 మంది ఉండగా, ప్రస్తుతం 32,106 యాక్టివ్ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అలాగే గడిచిన 24 గంటల్లో 2,071 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా కేసులు హైదరాబాద్ 327, రంగారెడ్డి 195, మేడ్చల్ 132 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
అలాగే రాష్ట్రంలో మరణాల రేటు 0.61 శాతం ఉండగా, దేశంలో 1.68 శాతం ఉంది. ఇక కోలుకున్నవారి రేటు 78.0 శాతం ఉండగా, దేశంలో 77.83 శాతం ఉంది. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో 25066 మంది చికిత్స తీసుకుంటున్నారు.
Next Story