హైదరాబాద్‌ ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో అగ్ని ప్రమాదం

By సుభాష్  Published on  10 Sep 2020 3:13 AM GMT
హైదరాబాద్‌ ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లిలో ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ముందుగా స్కూల్‌ అడ్మిన్‌ బ్లాక్‌లో దట్టమైన పొగలతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో స్కూల్‌ రికార్డులు, ఫర్నిచర్‌, కంప్యూటర్లు పూర్తిగా కాలిపోయాయి. అడ్మిన్‌ బ్లాక్‌లో మంటలు భారీగా చెలరేగాయి. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

పాఠశాల సిబ్బంది అగ్నిమాపక సిబ్బందిక సమాచారం అందించడంతో, వారు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. షాట్‌ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే హైదరాబాద్‌ నగరంలో ఇలా ఎన్నో అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నారు. ఒక వైపు కరోనా టెన్షన్‌.. మరో వైపు అగ్ని ప్రమాదాలు జరగడం మరింత ఆందోళన కలిగిస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

Next Story
Share it