తెలంగాణ కరోనా కేసులు: నిన్న తగ్గినా.. నేడు పెరిగాయి
By సుభాష్ Published on 29 Sep 2020 3:54 AM GMTతెలంగాణలో కోవిడ్ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ ప్రపంచ దేశాలన్నింటికి వ్యాపించి అతలాకుతలం చేస్తోంది. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా.. తగ్గుముఖం పట్టడం లేదు. తెలంగాణలో పాజిటివ్ కేసులు ఒక రోజు తగ్గినా.. మరుసటి రోజే అమాంతంగా పెరిగిపోతున్నాయి. నిన్న 1300 వరకు నమోదైన కేసులు నేడు ఒక్కసారిగా పెరిగిపోయాయి. తాజాగా తెలంగాణలో వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2072 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కొత్తగా 9 మంది మృతి చెందారు. ప్రతి రోజు కూడా మరణాల సంఖ్య కూడా ఏ మాత్రం తగ్గడం లేదు.
గడిచిన 24 గంటల్లో ..
పాజిటివ్ కేసుల సంఖ్య – 2,072మరణాల సంఖ్య – 9
కోలుకున్నవారు – 2,058
రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య -1,89,283
మొత్తంమరణాల సంఖ్య – 1116
మొత్తం యాక్టివ్ కేసులు – 29,477
ఐసోలేషన్లో ఉన్న వారి సంఖ్య – 23,934
రాష్ట్రంలో కోలుకున్నవారు – 1,58,690
రాష్ట్రంలో మరణాల రేటు – 0.58 శాతం
దేశంలో మరణాల రేటు – 1.57 శాతం
రాష్ట్రంలో కోలుకున్నవారి రేటు – 83.83 శాతం
దేశంలో కోలుకున్నవారి రేటు – 82.88 శాతం
గడిచిన 24 గంటల్లో అత్యధికంగా పాజిటివ్ కేసుల జిల్లాలు
జీహెచ్ఎంసీ – 283
కరీంనగర్ – 109
మేడ్చల్ మల్కాజిగిరి -160
నల్గొండ -139
రంగారెడ్డి – 161 పాజిటివ్ కేసులు నమోదు కాగా, మిగతా జిల్లాల్లో వందలోపు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.