మాకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ కావాలి

By రాణి  Published on  5 April 2020 1:40 PM GMT
మాకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ కావాలి

  • మోడీని కోరిన ట్రంప్

హైడ్రాక్సీ క్లోరోక్విన్..సాధారణంగా ఈ మందును మలేరియా వ్యాధిగ్రస్తులకు వాడుతారు. కానీ ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న వేళ వ్యాక్సిన్ లేకపోవడంతో కరోనా బారిన పడిన బాధితులకు అందించే వైద్యంలో ఎక్కువగా ఇస్తున్న మందు ఇదే. హైడ్రాక్సీ క్లోరోక్విన్ వాడటంతోనే చాలా మంది కరోనా బాధితులు కోలుకుంటున్నట్లు వైద్యులు చెప్తున్నారు. ఇప్పుడు అమెరికాలో పరిస్థితి చాలా దయనీయంగా మారింది. సహాయం కోసం ప్రపంచ పెద్దన్న ఎదురుచూస్తున్నారు. భారత్ లో హైడ్రాక్సీ క్లోరోక్విన్ మెడిసిన్ తోనే కరోనా బాధితులకు వైద్యం చేస్తున్నారని తెలుసుకున్న ట్రంప్..ప్రధాని మోడీకి ఫోన్ చేసి..తమ దేశ పౌరుల కోసం ఆ మందును ఎగుమతి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా వెల్లడించారు.

Also Read : గిరిజనుల కోసం కదిలిన కలెక్టర్, ఎమ్మెల్యేలు

‘‘నేను ఈరోజు ఉదయం ప్రధాని మోదీతో మాట్లాడాను. వారు భారీ స్థాయిలో హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను తయారు చేస్తున్నారు. అమెరికా కోరిన మేరకు ఔషధాల్ని అందించాలని కోరాం. భారత్‌ దీన్ని సీరియస్‌గా పరిశీలిస్తోంది’’ అని ట్రంప్ అమెరికా విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. కానీ..భారత్ మార్చి 25వ తేదీ నుంచి హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎగుమతులను తాత్కాలికంగా ఆపివేసింది. అయితే..తప్పనిసరి పరిస్థితుల్లో మానవతా దృక్పథంతో కొంతమేరకు ఎగుమతి చేసేందుకు మినహాయింపునిచ్చింది. ప్రస్తుతం అమెరికాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మోదీ ఆ దేశానికి హైడ్రాక్సీ క్లోరోక్విన్ ను ఎగుమతి చేస్తారా ? లేదా అన్నదానిపై సందిగ్ధత నెలకొంది. అమెరికాలో ఇప్పటి వరకు 3,11,357 మంది వైరస్‌ బారినపడ్డారు. వీరిలో 8,438 మంది మృత్యువాతపడ్డారు.

Also Read :మగబిడ్డకు జన్మనిచ్చిన కరోనా పేషెంట్

Next Story