జనవరిలో జరిగి మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు టీఆర్‌ఎస్‌కు పట్టం కడతారని తెలంగాణ టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు.శుక్రవారం తెలంగాణ భవన్‌లో పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. జనవరిలో జగరనున్న మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో నేతలకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూనే ప్రజల్లోకి వెళ్లాలని అన్నారు. ప్రజల సమస్యలపై దృష్టి సారించేలా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పుకొచ్చారు.

ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి పట్టం కడతాయని కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ నాయకత్వాన్నే కోరుకుంటున్నారని, అందుకే మున్సిపల్‌ ఎన్నికల్లో అన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామని అన్నారు. ఆరు లక్షల మందికి కేసీఆర్‌ కిట్‌లను అందించాబని, 40 లక్షల మందికి ఆసరా పెన్షన్లు ఇస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కూడా మళ్లీ టీఆర్‌ఎస్‌కే పట్టం కడతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.