టీఆర్‌ఎస్‌ నేత ఇంటిపై దాడి..

By అంజి  Published on  6 Feb 2020 7:31 AM GMT
టీఆర్‌ఎస్‌ నేత ఇంటిపై దాడి..

హైదరాబాద్‌: వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ టీఆర్‌ఎస్‌ నేత ఇంటిపై దాడి జరిగింది. కమ్మగూడలోని టీఆర్‌ఎస్‌ నేత ఇంటిపై కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్‌ తన అనుచరులతో కలసి దాడికి దిగాడు. పాత కక్షల నేపథ్యంలో ఈ ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ కాకుమాను సునీల్‌కు ఓడిపోయిన అభ్యర్థి పొలిశెట్టి ప్రేమ్‌కుమార్‌లకు గత కొంత కాలంగా వివాదాలు ఉన్నాయి. వీరికి చెందిన ఇరు వర్గాలకు ఎన్నికలు ముగిసన నాటి నుండి పలుమార్లు చిన్న చిన్న గొడవలు జరిగాయి. ఇదే విషయమై రెండు వర్గాలు పెద్ద మనుషుల మధ్య కూర్చొని చర్చించుకుందామని అనుకున్నారు.

బుధవారం సాయంత్రం కాకుమాను సునీల్‌ తన 70 మంది అనుచరులతో కలిసి టీఆర్‌ఎస్‌ నాయకులు లాజర్‌ ఇంటిపై దాడికి దిగారు. రాళ్లు కత్తులతో దాడికి దిగడంతో లాజర్‌ ఇంట్లో ఉన్న భాషా అనే యువకుడి చేతికి తీవ్ర గాయం అయ్యింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చారు. దీంతో సునీల్‌ అనుచరులు అక్కడినుంచి పరారీ అయ్యారు. డీసీపీ సంప్రీత్‌, ఏసీపీ జయరామ్‌ తదితరుల ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Next Story