'గులాబీ ' గుండెల్లో 'రోడ్‌ రోలర్‌'.. !

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Oct 2019 12:10 PM GMT
గులాబీ  గుండెల్లో రోడ్‌ రోలర్‌.. !

హుజూర్ నగర్: సోమవారం ఉప ఎన్నికలు ముగిశాయి. 24న ఫలితాలు వెలువడనున్నాయి. అయితే...ఇప్పటి వరకు వచ్చిన అన్ని ఎగ్జిట్ పోల్స్ టీఆర్‌ఎస్‌కే జై కొట్టాయి. కాని..వారిలో కూడా ఎక్కడో భయం. రోడ్ రోలర్ గుర్తు కారు కొంప ముంచుతుందని భయపడుతున్నారట..!

హుజూర్‌నగర్‌లో మొత్తం 2లక్షల 754 ఓట్లు పోలయ్యాయి. 84.76 శాతం పోలింగ్‌ నమోదైంది. వీరిలో మహిళలు 1,01,698. పురుషులు 99,056. గత ఎన్నికల కంటే ఐదు శాతం ఎక్కువగా ఓట్లు పడ్డాయి. అయితే ఇప్పుడు గులాబీ నేతల్లో కొత్త టెన్షన్‌ కనిపిస్తోంది. రోడ్డు రోలర్‌ గుర్తు తమకు డ్యామేజీ చేసిందనే ఆందోళన పట్టుకుంది.

ఇప్పటివరకూ వెలువడ్డ సర్వేలన్నీ టీఆర్‌ఎస్‌దే గెలుపు అని చెబుతున్నాయి. ఇటు గ్రౌండ్‌ లెవల్‌ నుంచి అందుతున్న సమాచారం కారు వైపు ఉంది. పదివేలకు పైగా మెజార్టీతోనే గెలుస్తామని గులాబీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. 20 వేలు దాటుతుందని మరికొందరు లెక్కలు వేస్తున్నారు. కానీ రోడ్డు రోలర్‌ గుర్తు ఏం చేస్తుందో అనే దడ మాత్రం టీఆర్‌ఎస్‌ నేతల్లో కనపడుతోంది.

కారు గుర్తు కిందనే ట్రాక్టర్, రోడ్ రోలర్ గుర్తులు

కారు గుర్తు కిందనే రైతు నడిపే ట్రాక్టర్‌ గుర్తు...ఆ తర్వాత రోడ్డు రోలర్‌ గుర్తు ఉన్నాయి. మూడు గుర్తులు చూసేందుకు ఒకేలా ఉన్నాయి. దీంతో ఇప్పుడు వృద్ధులు,మహిళలు, కొంత సైట్‌ ఉన్న వారు కారు అనుకుని పొరపాటున రోడ్డురోలర్‌కు వేశారని పోల్‌ పోస్టుమార్టంలో తేలింది. కారు అనుకుని పొరపాటున రోడ్డురోలర్‌కు వేశారని తేలడంతో గులాబీ నేతలకు టెన్షన్‌ పట్టుకుంది. రోడ్డు రోలర్‌ ఏంత మేరకు డ్యామేజీ చేసిందనే లెక్కలు సేకరించే పనిలో పడ్డారు. కనీసం ఐదు వేల ఓట్లు రోడ్డు రోలర్‌కు పడే అవకాశాలు ఉన్నాయనేది ప్రాథమిక అంచనా. మరికొందరు నేతలు మాత్రం కేవలం వెయ్యి నుంచి 1500 ఓట్లు పడ్డాయని లెక్కలు వేస్తున్నారు.

పొలిటికల్ లెక్కలు

రిపబ్లిక్ సేన పార్టీకి చెందిన కిరణ్ వంగపల్లి లి రోడ్ రోలర్ గుర్తు వచ్చింది. ఈయనకు ఎన్ని ఓట్లు పడతాయని అటు టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతలు పొలిటికల్‌ లెక్కలు వేస్తున్నారు. మరోవైపు రైతు బిడ్డ పార్టీ అజ్మీరా మహేష్ కు ట్రాక్టర్ నడిపే రైతు, ఇండిపెండెంట్ క్యాండేట్‌ లింగిడి వెంకటేష్ కు హెలికాప్టర్ గుర్తుకు ఎన్ని ఓట్లు పడ్డాయనేది కూడా ఆసక్తికరంగా మారింది.

Next Story