బ్రేకింగ్: సీఆర్పీఎఫ్‌ పెట్రోలింగ్‌ పార్టీపై ఉగ్రదాడి

By సుభాష్  Published on  1 July 2020 9:58 AM IST
బ్రేకింగ్: సీఆర్పీఎఫ్‌ పెట్రోలింగ్‌ పార్టీపై ఉగ్రదాడి

కశ్మీర్‌లో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. బుధవారం ఉదయం సోపోర్‌ ప్రాంతంలో సీఆర్పీఎఫ్‌ పెట్రోలింగ్‌ పార్టీపై కాల్పులకు తెగబడ్డారు. సోపోర్‌లోని మోడల్‌ టౌన్‌ వద్ద నాకా పార్టీపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారని జమ్మూకశ్మీర్‌ డీజీపీ దిల్బగ్‌ సింగ్‌ తెలిపారు. ఈ ఘటనలో పలువురు సీఆర్పీఎఫ్‌ జవాన్లు గాయడ్డారని తెలిపారు. అలాగే పలువురు సామాన్య ప్రజలు కూడా గాయపడినట్లు తెలిపారు.

దాడి జరిగిన ప్రాంతంలో కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహిస్తున్నామని, ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకున్నట్లు చెప్పారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించామని, ఉగ్రవాదుల కోసం ప్రత్యేక బలగాలతో గాలిస్తున్నామని తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story