ఉద్వేగానికి గురైన మాటల మాంత్రికుడు
By రాణి Published on 22 April 2020 7:19 PM ISTమాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి అప్పుడే 21సంవత్సరాలైపోయింది. 1999లో ఇండస్ట్రీకి పరిచయమైన త్రివిక్రమ్ తన మాటలతోనే నవ్వులు పూయిస్తారు. ఆ మాటల్లో మ్యాజిక్..పంచ్ డైలాగులే టాలీవుడ్ లో స్టార్ డమ్ తెచ్చిపెట్టింది. స్వయంవరం చిత్రంతో రైటర్ గా పరిచయమైన త్రివిక్రమ్ నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడి అవతారమెత్తారు. అప్పట్లో అమ్మ, ఆవకాయ్, అంజలిని మర్చిపోవడం అంత ఈజీ కాదు అన్న డైలాగ్ బాగా ఫేమస్ అయింది.
Also Read : అనసూయ జిమ్ కే వెళ్లదట..మరి ఆ ఫిజిక్ ఎలా మెయింటేన్ చేస్తోంది ?
1972, నవంబర్ 7వ తేదీన పుట్టిన త్రివిక్రమ్ అసలు పేరు ఆకెళ్ల నాగ శ్రీనివాస్ శర్మ. ఆంధ్రా యూనివర్శిటీ నుంచి న్యూ క్లియర్ ఫిజిక్స్ లో గోల్డ్ మెడల్ సంపాదించారు. స్వయంవరం , నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు, చిరునవ్వుతో, మల్లీశ్వరి వంటి చిత్రాలు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చిపెట్టాయి. ఇప్పటి వరకూ త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన 11 సినిమాల్లో దాదాపు 9 చిత్రాలు సక్సెస్ సాధించాయి. ఖలేజా సినిమాతో మహేష్ తో పంచ్ డైలాగ్ లు చెప్పించారు. అల్లు అర్జున్ తో వరుసగా మూడు సినిమాలు తీసి హ్యాట్రిక్ హిట్ కొట్టేశారు. పవన్ తో కూడా మూడు చిత్రాలను తీయగా..ఒకటి మాత్రమే బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
Also Read : వైద్యులపై దాడి చేస్తే ఏడేళ్లు జైలు : కేంద్రమంత్రి జవదేకర్
త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇండస్ట్రీకి వచ్చి 21 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కాస్తంత భావోద్వేగానికి గురయ్యారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకున్నారు.
ఈ ప్రయాణం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు, వెనక్కు తిరిగి చూడలేదు. ఇప్పుడు ఆలోచిస్తే ఎంతో గమ్మత్తుగా ఉంది, ఉద్వేగానికి లోనవుతున్నాను. నా ఈ ప్రయాణంలో సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరున నా హృదయ పూర్వక ధన్యవాదాలు. తెలుగుసినీ ప్రేక్షకులకు ఎప్పటికీ ఋణపడిఉంటాను.