అనసూయ జిమ్ కే వెళ్లదట..మరి ఆ ఫిజిక్ ఎలా మెయింటేన్ చేస్తోంది ?

By రాణి  Published on  22 April 2020 12:59 PM GMT
అనసూయ జిమ్ కే వెళ్లదట..మరి ఆ ఫిజిక్ ఎలా మెయింటేన్ చేస్తోంది ?

జబర్దస్త్ కామెడీ షో తో బుల్లితెర యాంకర్ గా అడుగుపెట్టిన అనసూయ పెద్ద సెలబ్రిటీ అయిపోయింది. ఇద్దరు పిల్లల తల్లి అయినా అనసూయ అందాన్ని చూసినవారెవరైనా ఆమెకు పెళ్లైందంటే నమ్మరు. ఆమెకు నెట్టింట్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ట్విట్టర్ ఖాతాలోనే ఆమెకు మిలియన్ ఫాలోవర్స్. వన్నె తరగని అందం ఆమె సొంతం. అలాంటి అనసూయ లాక్ డౌన్ సమయంలో బాగా విశ్రాంతి తీసుకుంటూ..ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుందట. #askAnasuya టాగ్ తో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు అనసూయ సమాధానమిచ్చారు.

నెటిజన్ : మీ ఇద్దరి పిల్లల్లో ఎవరు బాగా అల్లరి చేస్తారు ?

అనసూయ : వాళ్లిద్దరితో పాటు నేను

నెటిజన్ : మీ మనసులో మాట ?

అనసూయ : పెళ్లి తర్వాత స్త్రీ జీవితం అంతం కాదు. పెళ్లి అనేది జీవితానికి ఒక తోడు కోసమే. పెళ్లి తర్వాత అక్కడే ఆగిపోవాల్సిన అవసరం లేదు. ఎవరి కలలు వారికుంటాయి. అవి సాకారం చేసుకోవాలి.

నెటిజన్ : ఏ పుస్తకం మిమ్మల్ని ఏడిపించింది ?

అనసూయ : సిడ్నీ షెల్డన్ రాసిన If Tomorrow Comes.

నెటిజన్ : ప్రతి కూల పరిస్థితుల్లో మీరు నమ్మేది ?

అనసూయ : సెల్ఫ్ కాన్ఫిడెన్స్

నెటిజన్ : మీలో మీరు ఏదైనా మార్చుకోవాలంటే ఏం మార్పు కోరుకుంటారు ?

అనసూయ : ఒకరి కోసం నేను ఏదీ మార్చుకోను

నెటిజన్ : లాక్ డౌన్ ఎత్తివేత తర్వాత మీరు చేసే మొదటి పని ?

అనసూయ : సెలూన్ కి వెళ్లడం.

నెటిజన్ : మీ గురించి వచ్చే ట్రోల్స్ పై మీ అభిప్రాయం ?

అనసూయ : వారికి నేనే ముఖ్యం.

నెటిజన్ : ప్రస్తుత పరిస్థితిపై మీ అభిప్రాయం ?

అనసూయ : ప్రకృతి ప్రతి ఒక్కరినీ మళ్లీ మాములుగా మారుస్తోంది.

నెటిజన్ : మామిడికాయలు తిన్నారా ?

అనసూయ : హా..రోజూ తింటూనే ఉన్నా..

నెటిజన్ : మీ తల్లిదండ్రుల నుంచి వచ్చిన సూచనల్లో ఒకటి ?

అనసూయ : తప్పు చేయనపుడు భయపడకూడదు. వ్యక్తిగత గుర్తింపు పొందాలంటే స్వతంత్రంగా ఉండాలి.

నెటిజన్ : మీరు ఎక్కువగా ఏ రకమైన దుస్తులను ఇష్టపడుతారు ?

అనసూయ : ఆ సమయానికి నాకు ఏది సరైందో అదే..

నెటిజన్ : కర్తవ్యం, అరుంధతి, మిస్సమ్మ (ఓల్డ్) ఏది రీమేక్ చేయాలనుకుంటున్నారు ?

అనసూయ : నిజం చెప్పాలంటే నాకు రీ మేక్ ఇష్టం లేదు. కానీ ఎవరైనా అడిగితే మూడింటిలోనూ చేస్తా. మూడు వేర్వేరు నేపథ్యాలు కలిగిన సినిమాలు కదా.

నెటిజన్ : మీకు పరీక్షలంటే ఇష్టమై ?

అనసూయ : ఎప్పటికీ ఇష్టం లేదు.

నెటిజన్ : మీ నటించిన సినిమాల్లో ఏ క్యారెక్టర్ ను ఛాలెంజింగ్ గా తీసుకున్నారు ?

అనసూయ : అలాంటి ఛాలెంజ్ నాకెప్పుడూ రాలేదు.

నెటిజన్ : తమిళ సినిమాల్లో నటించే ఆసక్తి ఉందా ?

అనసూయ : ఉంది. కొన్ని కథలు కూడా విన్నాను. కానీ ఎందుకో కుదర్లేదు.

నెటిజన్ : జిమ్ లో ఎంత సమయం గడుపుతారు ?

అనసూయ : జిమ్ కే వెళ్లను.

నెటిజన్ : మీ మొదటి జీతం ఏం చేశారు ?

అనసూయ : మా అమ్మగారికి గోల్డ్ రింగ్ కొన్నాను.

నెటిజన్ : షూటింగ్స్ లేవు కదా.. బోర్ కొడుతోందా ?

అనసూయ : బోర్ కొట్టేంత సమయం లేదు.

నెటిజన్ : మీ జీవితం గురించి ఒక్కమాటలో ?

అనసూయ : ఉన్నదానిలో గొప్పగా జీవించడం. ఇప్పుడు అదే చేస్తున్నా.

నెటిజన్ : అదృష్టాన్ని నమ్ముతారా ?

అనసూయ : అప్పుడప్పుడూ..

నెటిజన్ : విమర్శకులపై మీ అభిప్రాయం ?

అనసూయ : నాకు విమర్శకులా ? లేదు లేదు..వారంతా అసహ్యించుకునేది నా డ్రస్సింగ్ స్టైల్ ని. నన్ను కాదు.

నెటిజన్ : మీ సొంత ఊరు ?

అనసూయ : నల్గొండ జిల్లా, పోచంపల్లి భూ దాన్

నెటిజన్ : పుష్ప సినిమాలో నటిస్తున్నారా ?

అనసూయ : ఇప్పటి వరకైతే లేదు.

నెటిజన్ : జీవితంలో మీరు చేసిన పనుల్లో గొప్పగా ఫీలైన విషయం ?

అనసూయ : ఎవరూ ఏదీ దాచుకోరు . నేను నా ఫ్యామిలీ, కుకింగ్, నా ఫాలోవర్స్ ను గొప్పగా ఫీలవుతుంటా.

నెటిజన్ : ఏదైనా సినిమాలో నటిస్తున్నారా ? లాక్ డౌన్ తర్వాత వాటిని కొనసాగిస్తారా ?

అనసూయ : మూడు సినిమాలున్నాయి. లాక్ డౌన్ తర్వాత ఏమవుతుందో చూడాలి .

నెటిజన్ : కాజల్ గురించి ఒక్కమాట ?

అనసూయ : ఆమె పరిచయం నా ఆలోచనా విధానాన్ని మార్చేసింది.

నెటిజన్ : లాక్ డౌన్ లో ఎలా గడుపుతున్నారు ?

అనసూయ : అందరికీ ఇది ఎందుకంత కష్టంగా ఉందో తెలీదు. నా వరకూ మాత్రం షూటింగ్ లేనప్పుుడు ఎలా ఉంటానో అలాగే ఉన్నా.

నెటిజన్ : ఎవరికైనా పేదవారికి హెల్ప్ చేయొచ్చు కదా

అనసూయ : నా సంగతి వదిలేయండి. ఇతరుల గురించి మీకెందుకు ? ముందు మీరు చేయండి.

నెటిజన్ : మీరేం హెల్ప్ చేయట్లేదంటున్నారు. ఫొటోలు పెట్టొచ్చుగా..

అనసూయ : ఎవరికి సహాయం అందాలో వారికి అందుతుంది. అందరికీ తెలిసేలా చేయాల్సిన అవసరం లేదు. అదంతా బేకార్ ముచ్చట.

నెటిజన్ : ఏం లేకుండా ఉండలేరు?

అనసూయ : ఫ్యామిలీ, పని.

నెటిజన్ : మీ భర్తని మొదటిసారి కలిసింది ?

అనసూయ : 2001, ఏప్రిల్, తేదీ గుర్తులేదు.

అనసూయ : వీలైనంత వరకూ అందరికీ సమాధానం చెప్పేందుకు ట్రై చేశాను. ఇంకా ఎవరైనా మిస్ అయ్యుంటే మళ్లీ చెప్తాను.

Next Story