వైద్యులపై దాడి చేస్తే ఏడేళ్లు జైలు : కేంద్రమంత్రి జవదేకర్

By రాణి  Published on  22 April 2020 11:02 AM GMT
వైద్యులపై దాడి చేస్తే ఏడేళ్లు జైలు : కేంద్రమంత్రి జవదేకర్

కరోనా వైరస్ బారి నుంచి దేశ ప్రజలను రక్షించేందుకు తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న వైద్య సిబ్బందిపై దాడులు చేస్తే ఉపేక్షించేది లేదని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ స్పష్టం చేశారు. వైద్యసిబ్బంది, హెల్త్ వర్కర్లపై దాడికి పాల్పడిన వారికి ఆర్నెలల నుంచి ఏడేళ్ల వరకూ జైలు శిక్ష విధించేలా కేంద్రం కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఈ విషయం జవదేకర్ మాట్లాడుతూ..కరోనా పై పోరాడుతున్న వైద్యులు, ఇతర సిబ్బంది పై దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వైద్యుల వాహనాలు, ఆస్తులను ధ్వంసం చేస్తే మార్కెట్ ధర కన్నా రెట్టింపు జరిమానా వసూలు చేస్తామన్నారు.

Also Read : కులాంతర వివాహం..చెల్లెలింటికి వెళ్లొస్తానని చెప్పి

1897 ది ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ లో కొన్ని సవరణలు చేస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ప్రకారం వైద్యులపై దాడులకు పాల్పడితే 3-7 సంవత్సరాల జైలుశిక్ష, అలాగే లక్ష నుంచి 5 లక్షల రూపాయల వరకూ జరిమానా విధిస్తామమన్నారు. కేవలం వైద్యులపై దాడులను అరికట్టేందుకే ఈ ఆర్డినెన్స్ తీసుకొస్తున్నట్లు తెలిపారు. వైద్యులతో పాటు ఆశా వర్కర్లు, సిబ్బందికి రూ.50లక్షల భీమా కల్పిస్తున్నట్లు జవదేకర్ వివరించారు.

ఇటీవల కాలంలో గాంధీ లో రెండుసార్లు వైద్యులపై దాడులు జరిగాయి. ఈ దాడుల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా ఖండించాయి. ప్రజల కోసం పనిచేస్తున్న వైద్యులపై దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించాయి.

Also Read :మొక్కలు నాటుదాం..భూదేవిని రక్షించుకుందాం..

Next Story