భారత మహిళా క్రికెటర్‌ ఆత్మహత్య

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Jun 2020 1:31 PM GMT
భారత మహిళా క్రికెటర్‌ ఆత్మహత్య

బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య ఘటనను మరువక ముందే మరే విషాదం చోటు చేసుకుంది. భారత మహిళా క్రీడాకారిణి ఆత్మహత్య చేసుకుంది. ఆమెను త్రిపుర రాష్ట్రానికి చెందిన అయంతి రీయాంగ్‌ గా గుర్తించారు. స్థానిక దిన పత్రికల కథనం ప్రకారం త్రిపుర రాష్ట్రానికి చెందిన అయంతి రీయాంగ్‌ త్రిపుర రాష్ట్రం తరుపున అండర్‌-19 జట్టులో ఆడుతోంది.

కాగా.. మంగళవారం రాత్రి తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె వయసు 16 సంవత్సరాలు. నలుగురు తోబుట్టువుల్లో చివరి అమ్మాయి అయంతి. రాష్ట్ర రాజధాని అగర్తాలా నుండి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉదయపూర్ లోని తెనాని గ్రామం ఆమె స్వస్థలం. గత కొంతకాలంగా ఆమె త్రిపుర అండర్‌-19 జట్టులో కొనసాగుతోంది. త్రిపుర తరుపున అండర్‌-23 టీ20 టోర్నమెంట్‌లో కూడా పాల్గొంది. ఆమె రీయాంగ్ తెగకు చెందినది యువతి. త్రిపుర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి తిమురా చందా మాట్లాడుతూ.. రాష్ట్రం ప్రతిభావంతులైన క్రీడాకారిణిని కోల్పోయామని పేర్కొన్నారు. కాగా ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Next Story
Share it