సంచలన నిర్ణయం: సడన్‌గా షాకిచ్చిన భారత రైల్వేశాఖ..రైళ్లన్నీ రద్దు..!
By సుభాష్ Published on 14 May 2020 11:00 AM ISTభారత రైల్వేశాఖ షాకిచ్చింది. జూన్ 30 వరకూ అన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రరకటిచింది. వలస కూలీలను తరలించే శ్రామిక్ రైళ్లు తప్ప ఏ రైళ్లను కూడా నడపబోమని స్పష్టం చేసింది. అంతేకాదు ప్రయాణికులు బుక్ చేసుకున్న టికెట్లన్నీ రద్దు చేస్తున్నట్లు తెలిపింది. డబ్బులను సైతం తిరిగి వెనక్కి చెల్లిస్తామని స్పష్టం చేసింది రైల్వేశాఖ. అయితే అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడంపై రైల్వే శాఖ ఎలాంటి కారణాలు వెల్లడించలేదు.
ఇప్పటికే దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. వలస కూలీలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వారి కోసం ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అయితే కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ సడలింపులో భాగంగా కొన్ని సడలింపులు ఇచ్చింది. అందులో రైళ్లను సైతం నడుపుతున్నట్లు స్పష్టం చేసింది. ఈనెల 12 నుంచి కొన్ని ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. కానీ ఏమైందో తెలియదుగానీ జూన్ 30 వరకూ అన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో ప్రయాణికుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది.