'రాక్షస 'బోరులు..!
By సత్య ప్రియ Published on 30 Oct 2019 12:53 PM ISTసుమారు 75 గంటల సహాయక చర్యల తరువాత కూడా తిరుచి లో ఆడుకుంటూ బోరు బావిలో పడిపోయిన 2 ఏళ్ల చిన్నారి సుజీత్ విల్సన్ ను కాపాడుకోలేక పోయాం. దేశంలో అందరూ సుజీత్ కోసం కన్నీటి పర్యంతం అయ్యారు. #RIPsujit అంటూ ట్విట్టర్ మారుమోగింది. సంవత్సరాలుగా, భారత దేశంలో ఇటువంటి ఉదంతాలు ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. నిర్లక్ష్యం, అశ్రద్ధ వల్ల పసిప్రాణాలు మట్టిలో కలిసిపోతున్నాయి.
జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాల (NDRF) రిపోర్ట్ ప్రకారం, మనదేశంలో భూగర్భ జలాల పై అధికంగా ఆధారపడతాం, సుమారుగా, సంవత్సరానికి 230 క్యూబిక్ కిమీ ల మేర భుగర్భ నీరు ను మనం తోడుకుంటాం. ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఇది చాలా ఎక్కువ. దేశంలో 27 మిలియన్ల బోరుబావులు ఉన్నట్టు అంచనా. 2009 నుంచి 40 కంటే ఎక్కువమంది పిల్లలు బోరు బావులలో పడ్డారు, అందులో 70 శాతం సహాయక చర్యలు విఫలం అయ్యాయి.
రాష్ట్రవారిగా చూస్తే, పిల్లలు బోరుబావిలో పడిన సంఘటనలు హర్యాణ, తమిళనాడు, గూజరాత్ రాష్ట్రాల్లో అత్యధికంగా 17.6%, రాజస్థాన్ లో 11.8 %, కర్ణాటకలో 8.8%, మధ్య ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్రలలో 5.5%, అసోం లో 2.9% జరిగినట్టు తెలుస్తోంది. సుజీత్ ఉదంతంతో పాటు, బోరు బావి సంఘటనలు అత్యధికంగా తమిళనాట జరుగుతున్నట్టు తెలుస్తోంది.
ఈ సంఘటనలు చోటు చేసుకోవడానికి కారణాల జాబితా తయారు చేస్తే, పిల్లలు ఎక్కువగా ఆడుకుంటూ బోరుబావిలో జారిపడినట్టు చూడవచ్చు.
జాబితాలోని మొదటి 5 కారణాలు:
1. ఆడుకుంటూ పడిపోవడం
2. మూసివేయని బోరు బావి
3. తాత్కాళిక మూతలు పెట్టడం
4. కనిపించక పోవడం
5. హెచ్చరికలు తెల్పే బోర్డులు లేకపోవడం
6. వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టక పోవడం
2014 నుంచి 2018 వరకూ, ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు, NDRF సహాయక బృందాలు 15 మంది పిల్లలని కాపాడగలిగాయి, 16 మంది మరణించారు. మహారాష్ట్ర లో 10 సంఘటనలు జరుగగా, రాజస్థాన్ లో 9, కర్ణాటకా, గుజరాత్ లలో 3 బోరు బావి ఉదంతాలు చోటు చేసుకున్నాయి.
ఈ సంవత్సరం మొదలులో జరిగిన బోరు బావి ఉదంతాలు:
జూన్ 2019 లో సంగ్రూర్, హర్యాణ కి చెందిన 2 ఏళ్ల ఫతెవీర్ సింగ్, 150 అడుగులు లోతు గల బోరు బావిలో పడిపోగా సహాయక బృందాలు 109 గంటల పాటు శ్రమించినా ఫలితం లేకపోయింది.
ఏప్రిల్ 2019 లో, జోద్ పూర్ కి చెందిన 4 ఏళ్ళ సీమా, 14 గంటల పాటు శ్రమించి వెలికితీసారు. కానీ ఈ మధ్యలోనే చిన్నారి కన్ను మూసింది.