చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సంతపేటలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడ్డారని స్థానికులు భావిస్తున్నారు. మృతులు భర్త రవి (50), భార్య భువనేశ్వరి (45), కుమార్తె గాయత్రి (9). చిత్తూరులో ఆటో నడుపుతూ రవి జీవనం సాగిస్తున్నాడు. కూల్‌డ్రింక్‌లో విషం కలిపి తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న చిత్తూరు టూటౌన్‌ సీఐ యుగేందర్‌ మృతదేహాలను పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story