విషాదం : సెల్లార్‌లో చేరిన వరద నీటిలో పడి బాలుడి మృతి
By న్యూస్‌మీటర్ తెలుగు
హైద్రాబాద్ దిల్‌సుఖ్ నగర్ లో విషాదం చోటుచేసుకుంది. గత మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా దిల్‌సుఖ్ నగర్ సాహితీ అపార్ట్ మెంట్ లోని సెల్లార్ లోకి వచ్చిన వరద నీటిలో మునిగి అజిత్ సాయి అనే మూడు సంవత్సరాల బాలుడు మృతి చెందాడు.
నిన్న కురిసిన భారీ వర్షానికి అపార్ట్ మెంట్ సెల్లార్ లోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. బాలుని తల్లిదండ్రులు ఇంట్లోనే ఉన్నారు.. ఉదయం బాబు ఆడుకుంటూ కిందకు వెళ్లి సెల్లార్‌లోని నీటిలో పడ్డాడు. బాబు కనిపించకపోవడాన్ని గమనించిన తండ్రి యుగేందర్ కింద సెల్లార్‌లోకి వెళ్లి చూశాడు.
అప్పటికే నీళ్లలో పడిపోయిన అజిత్ సాయిని బయటికి తీసి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో బాబు వైద్యులు చెప్పడంతో అజిత్ సాయి తల్లీదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ప్రమాదంపై సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.