పరిగెత్తాడు.. ఓ ప్రాణం రక్షించేందుకు దారిచ్చాడు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Nov 2020 2:43 PM GMT
పరిగెత్తాడు.. ఓ ప్రాణం రక్షించేందుకు దారిచ్చాడు..!

ప్రాణాపాయ స్థితిలో ఉన్న‌ ఓ వ్యక్తిని తీసుకెళుతున్న అంబులెన్సును ఆసుపత్రికి చేర్చి మానవత్వం చాటుకున్నాడు ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్. హైదరాబాద్ అబిడ్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ట్రాఫిక్ కానిస్టేబుల్ గా పనిచేసే బాబ్జి.. నిత్యం రద్దీగా ఉంటే మొజంజాహి మార్కెట్ నుండి కోఠి వెళ్లే దారిలో ఓ అంబులెన్స్ ట్రాఫిక్ లో చిక్కుకోవడం గమనించాడు. వెంటనే దానికి దారి క్లియర్ చేయాలనుకున్నాడు.

పరిగెడుతూ ఆ అంబులెన్స్ కు దారి క్లియర్ చేసాడు. అయితే ప్రాణాపాయ స్థితిలో ట్రాఫిక్ లో చిక్కుకున్న వారు ఆసుపత్రికి చేరుకొని ప్రాణాప్రాయం నుండి బయటపడ్డారు. దీంతో వారి ప్రాణాలు కాపాడిన ఆ కానిస్టేబుల్ సహాయానికి కృతజ్ఞతగా ఆ వీడియో ను సోషల్ మీడియా లో పెట్టారు. కానిస్టేబుల్ సమయస్ఫూర్తికి పోలీస్ ఉన్నతాధికారులతో పాటు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Next Story