పట్టాలు తప్పింది..అంతరాయం కలిగించింది

By సుభాష్  Published on  6 Jan 2020 4:15 PM IST
పట్టాలు తప్పింది..అంతరాయం కలిగించింది

వరంగల్ అర్బన్ జిల్లాలో రైలు ప్రమాదం తృటిలో తప్పింది. కాజీపేట రైల్వేస్టేషన్‌ సమీపంలో ఓ రైలు ఇంజన్‌ పట్టాలు తప్పింది. దీంతో పలు రైళ్ల రాకపోలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ ప్రెస్‌ ను అధికారులు కాజీపేట స్టేషన్‌లోనే నిలిపారు. ఘన్‌పూర్‌ స్టేషన్‌లో దానాపూర్‌ ఎక్స్‌ ప్రెస్ ను నిలిపివేశారు. రైలు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఘటన స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది పట్టాలు తప్పిన రైలును పక్కకు జరిపి మరమ్మతులు చేశారు. కాగా, రైలు ఇంజన్‌ మార్చేందుకు వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. ఇలాంటి రైలు ప్రమాదాలు, రైలు పట్టాలు తప్పడం లాంటివి చాలా చోట్ల జరుగుతూనే ఉన్నాయి. గత ఏడాదిలో కూడా ఘోర రైలు ప్రమాదాలు చాలానే జరిగాయి. దేశంలో సమయ పాలన లేకుండా నడిచేవి ఏమిటంటే రైళ్లు అనే చెప్పాలి. ముందే ఆలస్యం అంటే ఇలాంటి ప్రమాదాలు జరగడంతో ప్రయాణికులు గమ్యస్థానాలు చేరుకోవడానికి ఇంకా సమయం పడుతుంది. ఈ కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురికావల్సి వస్తోంది.

Train2

Train 4

Next Story