ఎలక్టోరల్ బాండ్ల ద్వారా భారీగా విరాళాలను అందుకున్న పార్టీలలో బీఆర్ఎస్ టాప్.. ఆ తర్వాత?

2024 మెగా సార్వత్రిక ఎన్నికలకు ముందు సుప్రీంకోర్టు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎలక్టోరల్ బాండ్‌లు, దాతల జాబితాకు సంబంధించిన డేటాను కోరింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  12 March 2024 6:24 AM GMT
YCP, BRS, donations, electoral bonds

ఎలక్టోరల్ బాండ్ల ద్వారా భారీగా విరాళాలను అందుకున్న పార్టీలలో బీఆర్ఎస్ టాప్.. ఆ తర్వాత? 

2024 మెగా సార్వత్రిక ఎన్నికలకు ముందు సుప్రీంకోర్టు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎలక్టోరల్ బాండ్‌లు, దాతల జాబితాకు సంబంధించిన డేటాను కోరింది. ఎలక్టోరల్ బాండ్ల సమాచారాన్ని ఎన్నికల కమిషన్‌కు సమర్పించేందుకు ఎస్‌బీఐకి మార్చి 12 వరకు సుప్రీంకోర్టు గడువు ఇచ్చింది. ఫిబ్రవరి 15న ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం అనామక రాజకీయ నిధులను అనుమతించే ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని రద్దు చేసింది, దీనిని 'రాజ్యాంగ విరుద్ధం' అని పేర్కొంది. దాతలు విరాళంగా ఇచ్చిన మొత్తాన్ని ఎన్నికల సంఘానికి వెల్లడించాలని ఆదేశించింది.

ఈ వివరాలను సమర్పించడానికి SBI జూన్ వరకు పొడిగింపును కోరుతూ ఉండగా.. మార్చి 12 లోపు ఎలక్టోరల్ బాండ్ల డేటా ఇవ్వాల్సిందేనని ఉన్నత న్యాయస్థానం కోరింది. అంతేకాకుండా, SBI సమర్పించిన బాండ్ల పబ్లిక్ వివరాలను తెలియజేయాలని సుప్రీం కోర్టు ECIని ఆదేశించింది. NewsMeter భారత ఎన్నికల సంఘానికి ప్రాంతీయ రాజకీయ పార్టీలు సమర్పించిన నివేదికలను పరిశీలించింది. గత ఏడాది డిసెంబర్ వరకు తెలంగాణలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి (BRS) రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక నిధులు పొందినట్లు గుర్తించింది.

విరాళాలకు సంబంధించిన డేటా:

BRS:

మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని BRS, తెలంగాణలో ప్రతిపక్షంలో ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 683 కోట్ల విరాళాలు అందుకుంది. వీటిలో రూ. 529 కోట్లు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చాయి. విరాళాలలో 80 శాతం 'బహిర్గతం చేయని మూలాల' నుండి ఎలక్టోరల్ బాండ్లకు విరాళాలు వచ్చాయి. దాతల నుండి రూ. 154 కోట్లు వచ్చినట్లు కనుగొంది. కరీంనగర్ సిట్టింగ్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజపుషా బీఆర్‌ఎస్‌కు భారీగా నిధులు సమకూర్చారు. నివేదికల ప్రకారం, BRS సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల కమలకర్, BRS రాజ్యసభ ఎంపీ రవి చంద్ర వద్దిరాజు -- గాయత్రీ గ్రానైట్స్, హంస పవర్ అండ్ ఇన్‌ఫ్రా లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్; పి జయచంద్రారెడ్డి నేతృత్వంలోని రాజపుష్ప ఒక్కొక్కరికి రూ.10 కోట్లు విరాళంగా ఇచ్చారు. రూ.154 కోట్లలో ఈ నలుగురి నుంచి రూ.40 కోట్లు వచ్చాయి.

2023 నవంబర్‌లో, తెలంగాణ రాష్ట్ర ఎన్నికలకి ముందు రూ. 1,148.38 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్‌లు, నిధులు సేకరించారు. SBI హైదరాబాద్ బ్రాంచ్ లో అత్యధికంగా రూ. 376 కోట్లు సేకరించారు.

YSRCP:

న్యూస్ మీటర్ YSRCP రిపోర్ట్‌లను కూడా విరాళాలు వచ్చాయి. YSRCP ఎలక్టోరల్ ట్రస్టుల ద్వారా రూ.16 కోట్లు, ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ.52 కోట్లు, వ్యక్తిగత విరాళాల ద్వారా రూ.30 లక్షలు వచ్చాయి. మొత్తంగా వైఎస్సార్‌సీపీకి రూ.68 కోట్లు వచ్చాయి.

టీడీపీ:

ట్రస్ట్‌లు లేదా బాండ్ల ద్వారా టీడీపీ ఎలాంటి నిధులు/విరాళాలను స్వీకరించలేదని నివేదికలు సూచించాయి. మొత్తంగా వ్యక్తిగత విరాళాల ద్వారా పార్టీకి రూ.11.92 కోట్లు వచ్చాయి.

AIMIM:

హైదరాబాద్ పార్లమెంటేరియన్ అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని AIMIM పార్టీకి 24 లక్షలు వచ్చాయి, 100 శాతం నిధులు ఔరంగాబాద్ నుండి వచ్చాయి.

తెలిసిన, తెలియని మూలాలు అంటే ఏమిటి?

రాజకీయ పార్టీలకు నిధులకు సంబంధించి వనరులు ఉన్నాయి. ఎలక్టోరల్ ట్రస్ట్‌లు, ఎలక్టోరల్ బాండ్‌లు, వ్యక్తిగత నిధులు, పార్టీ సభ్యత్వాలు ఉన్నాయి. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) ప్రకారం రూ. 20,000 కంటే ఎక్కువ విరాళాలు ఇచ్చిన దాతల వివరాలు భారత ఎన్నికల సంఘం (ECI)కి పార్టీలు సమర్పించిన సహకార నివేదికల ద్వారా అందుబాటులో ఉంటాయి. తెలియని మూలాలకు సంబంధించి వార్షిక ఆడిట్ నివేదికలలో ఆదాయాన్ని తెలియజేయాలి. ఎలక్టోరల్ బాండ్‌లు, కూపన్‌ల విక్రయాలు, రిలీఫ్ ఫండ్‌లు, ఇతర ఆదాయాలు, స్వచ్ఛంద విరాళాలు, సమావేశాలు/మోర్చాల ద్వారా విరాళాలు వంటివి ఉంటాయి.

ఎలక్టోరల్ ట్రస్టుల ద్వారా నిధులు:

ఎలక్టోరల్ బాండ్‌లు కాకుండా, ప్రైవేట్ కంపెనీల వంటి దాతలు ఎలక్టోరల్ ట్రస్ట్‌ల ద్వారా రాజకీయ పార్టీలకు డబ్బును పంపవచ్చు. ప్రుడెంట్ ట్రస్ట్ కూడా అనేక ట్రస్ట్‌లలో ఒకటి, దీనిని భారతి గ్రూప్ మొదట ఏర్పాటు చేసింది. భారతదేశంలో అత్యంత సంపన్నమైన ట్రస్ట్‌గా, ప్రూడెంట్ రాజకీయ నిధుల రూపంలో రూ. 363.16 కోట్లను పొందింది, ఇందులో రూ. 363.15 కోట్లు పంపిణీ చేసినట్లు భారత ఎన్నికల కమిషన్‌కు తెలిపింది.

హైదరాబాద్‌కు చెందిన MEIL, మేధాకు చెందిన ఎలక్టోరల్ ట్రస్ట్‌లు FY23లో రూ.122 కోట్ల వరకు విరాళాలు అందించిన టాప్ 10 దాతలలో ఒకటిగా ఉంది. భారతదేశంలోని 54వ అత్యంత సంపన్నుడు PV కృష్ణా రెడ్డి కంపెనీ మేఘా ఇంజినీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) FY 2023లో ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్‌కు రూ. 87 కోట్లు విరాళంగా ఇచ్చింది. ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం, 2023లో అతని సంపద US $ 4.05 బిలియన్లకు పెరిగింది, హైదరాబాద్ నుండి భారీగా రాజకీయ నిధులు సమకూర్చే వ్యక్తి కృష్ణా రెడ్డి. అతని తర్వాత హైదరాబాద్‌కు చెందిన మరో కంపెనీ మేధా సర్వో డ్రైవ్స్ అదే సంవత్సరంలో రూ. 35 కోట్లు అందించింది. కాంగ్రెస్ పార్టీకి ఒక్క విరాళం కూడా రాలేదు. మొత్తం మొత్తాన్ని BJP, BRS, YSRCP, AAP మధ్య పంపిణీ చేశారు. నిధుల్లో అత్యధిక వాటాను బీజేపీకి దక్కుతోంది. ప్రూడెంట్ ట్రస్ట్‌కు అందిన మొత్తం రాజకీయ నిధులలో రూ.75 కోట్లు బీఆర్‌ఎస్‌కు, రూ.16 కోట్లు వైఎస్‌ఆర్‌సీపీకి, రూ.90 లక్షలు ఆప్‌కి, మిగిలిన రూ.276 కోట్లు బీజేపీకి చేరాయి.

ఎలక్టోరల్ బాండ్లను ఎలా కొనుగోలు చేస్తారు?

ఎలక్టోరల్ బాండ్ (EB) కొనుగోలు చేసేటప్పుడు.. కొనుగోలుదారుపై ఎలాంటి పన్ను ఉండదు. బదులుగా, ప్రభుత్వం ఎలక్టోరల్ బాండ్లను ప్రాసెస్ చేయడానికి బ్యాంకుకు డబ్బును జత చేస్తుంది. ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ 2018లో, ఎలక్టోరల్ బాండ్‌లను కొనుగోలు చేసే దాతలు SBIకి ఎలాంటి సర్వీస్ ఛార్జీలు (కమీషన్) చెల్లించాల్సిన అవసరం లేదు లేదా EBలను ముద్రించడానికి అయ్యే ఖర్చును కూడా భరించాల్సిన అవసరం లేదు. అపారదర్శక EB స్కీమ్ కు సంబంధించి ఈ వ్యయాన్ని ప్రభుత్వం లేదా అంతిమంగా పన్ను చెల్లింపుదారులు భరిస్తారు.

అపారదర్శక ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ 2018 ద్వారా రాజకీయ పార్టీలకు పన్ను రహిత నిధుల లావాదేవీల కోసం ట్యాక్స్ పేయర్లు రూ. 13 కోట్ల, 50 లక్షల, 73 వేలు ప్రభుత్వం ద్వారా చెల్లించాలి. ఈ ఎలక్టోరల్ బాండ్ల నిర్వహణ కోసం ప్రభుత్వ యంత్రాంగం మానవశక్తిని కూడా ఉపయోగిస్తూ ఉంటుంది. ఇందుకోసం భారీ మొత్తంలో ఖర్చవుతోంది.

ఎలక్టోరల్ బాండ్లను ప్రాసెస్ చేయడానికి ట్యాక్స్ పేయర్లే డబ్బులు చెల్లించాలి:

ఆరేళ్లలో 29 దశల్లో ఎలక్టోరల్ బాండ్ల విక్రయానికి సంబంధించి కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం రూ.13 కోట్లకు పైగా పన్ను వసూలు చేశారు. ప్రింటింగ్‌తో సహా ఎలక్టోరల్ బాండ్‌లను ప్రాసెస్ చేయడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కి ఖర్చు అయింది.

ఈ విషయంలో నిజాలు నిగ్గు తేల్చడానికి NewsMeter సమాచార హక్కు (RTI) ద్వారా సమాధానానికి సంబంధించిన కాపీని పొందింది. మొత్తం రూ. 11,60,65,674 (GSTతో కలిపి) SBI ద్వారా ప్రభుత్వానికి ఖర్చు వెళ్ళింది. ఇప్పటివరకు ఇది పన్ను చెల్లింపుదారుల నుండి స్వీకరించారు. ప్రింటింగ్ ఖర్చులకు సంబంధించి 6,74,250 ఎలక్టోరల్ బాండ్ల ముద్రణ కోసం ప్రభుత్వం లేదా పన్ను చెల్లింపుదారులపై రూ.1,90,01,380 (GSTతో కలిపి) భారం పడింది. 'మాస్క్-ఎ-ప్రింట్ సెక్యూరిటీని ధృవీకరించే పరికరం' కోసం అదనంగా రూ. 6,720 ఖర్చు పెట్టాల్సి ఉంది. రూ.11 కోట్లలో ప్రభుత్వం ఇప్పటివరకు 25 దశలకు కమీషన్‌ కింద రూ.8,57,06,831 చెల్లించారు. మిగిలిన వాటికి చెల్లింపులకు సంబంధించి 'under consideration for payment.’ అని ఉంది. అంటే చెల్లింపుల కోసం పరిశీలనలో ఉందట. ఇలా వీటికి సంబంధించిన పన్ను భారం కూడా ప్రజల మీదే పడింది.

Next Story