మన ఆశ వర్కర్లకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అవార్డు
By - Nellutla Kavitha | Published on 23 May 2022 9:21 PM IST"హిందీ భాషలో ఆశ అంటే నమ్మకం అని అర్థం, కోవిడ్ కల్లోలం తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు భారతదేశంలో ఉన్న 10 లక్షల మంది ఆశా వర్కర్లు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి తిరిగి బాధితులను గుర్తించారు. వైరస్ ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా చర్యలు తీసుకుంది ఆశా నెట్వర్క్" అంటూ డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ గ్లోబల్ హెల్త్ లీడర్ అవార్డును భారత్ లోని ఆశ నెట్వర్కు అందజేశారు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ డాక్టర్ టెడ్రాస్ అధనోమ్.
గత మూడేళ్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ అందజేస్తున్న ఈ అవార్డ్ ను నిన్న వర్చువల్ గా జరిగిన సమావేశంలో అందించారు డబ్ల్యూహెచ్ఓ చీఫ్ డాక్టర్. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో విశేషమైన వైద్య సేవలు అందిస్తుందని గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్తల నెట్వర్క్ కు ఈ విధంగా ప్రపంచ గుర్తింపు లభించింది. కోవిడ్ మహమ్మారి ప్రబలకుండా, ఆశా కార్యకర్తలు కీలకమైన సమయాల్లో, అత్యంత ప్రభావవంతంగా పని చేశారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది. 2019లో గ్లోబల్ హెల్త్ లీడర్ అవార్డ్స్ ని ప్రారంభించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. డ బ్లూ హెచ్ వో ఏర్పడి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ అవార్డుని వర్చువల్ గా ఆశ వర్కర్లకు ప్రధానం చేశారు.
ఫిబ్రవరి 24న తాలిబన్ల కాల్పుల్లో మృతి చెందిన 8 మంది పోలియో నిర్మూలన బృంద సభ్యులకు కూడా ఈ అవార్డును ప్రకటించారు. ఇక వ్యక్తిగత విభాగంలో డబ్ల్యూహెచ్ఓ కుష్టు నివారణ విభాగానికి జపాన్ దేశం తరఫున రాయబారిగా ఉన్న ససవాకాకు, మరణానంతరం హార్వర్డ్ కు చెందిన డాక్టర్ పాల్ ఫార్మర్ కు, బ్రిటన్కు చెందిన సైకియాట్రిస్ట్ డాక్టర్ అహ్మద్ ప్రకటించారు