విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం

vijayawada fire accident I విజయవాడ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చిట్టినగర్‌లోని మిల్క్‌ ప్రాజెక్టు

By సుభాష్  Published on  11 Nov 2020 3:06 AM GMT
విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం

విజయవాడ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చిట్టినగర్‌లోని మిల్క్‌ ప్రాజెక్టు సమీపంలో ఉన్న పాత ప్రసాద్‌ థియేటర్‌లో అర్ధరాత్రి సమయంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. విద్యుత్‌ షాట్‌ సర్య్కూట్‌ కారణంగానే ప్రమాదం సంభవించి ఉంటుందని భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఫైర్‌ సిబ్బంది హుటాహుటిన మూడు ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే థియేటర్‌ మూతపడటంతో ప్రాణ నష్టం తప్పింది. ప్రమాదం జరుగగా చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో దాదాపు రూ.46 లక్షల వరకు ఆస్తినష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


Next Story