KCR పై ఫైర్ బ్రాండ్ తీవ్ర వ్యాఖ్యలు
By - Nellutla Kavitha | Published on 11 April 2022 7:05 PM IST
కెసిఆర్ ఢిల్లీలో దొంగ దీక్ష చేస్తూ ఇక్కడ రైతన్నలకు మోసం చేస్తున్నారని BJP ఫైర్ బ్రాండ్ విజయశాంతి అన్నారు. ఒక పక్క పక్క రాష్ట్రల ముఖ్యమంత్రులకు ఇవ్వడానికి డబ్బు ఉంటుంది, స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీకి వెళ్లిడానికి డబ్బు ఉంటుంది, పీకేని తీసుకోచ్చి 500 కోట్లు ఇవ్వడానికి ఉంటుంది కానీ అన్నం పెట్టే రైతన్నకివ్వడానికి ఎందుకు డబ్బు లేదని ప్రశ్నించారు విజయశాంతి.
రైతాంగానికి సమస్యలు సృష్టించదే కేసీఆర్ అని ఆయన్ని అన్నం పెట్టే రైతన్న నమ్మట్లేదన్నారు విజయశాంతి. తెలంగాణా లో ప్రెసిడెంట్ పాలన రావాలని, KCR అనే ఒక వ్యక్తికి ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హత లేదన్నారామె. ప్రజలు సీయం ను గద్దె దింపడానికి నడుం బిగించాలని, BJP ని తీసుకురావాలని పిలుపునిచ్చారు విజయశాంతి. తెలంగాణ రైతులు బాగుండాలంటే BJP రావాలన్నారామె.
Next Story