ప్రధాని మోదీ నేతృత్వంలో భారీ విజయాలు: సీఎం యోగి

UP by Elections .. ప్రధాని మోదీ నేతృత్వంలో భారీ విజయాలు: సీఎం యోగి

By సుభాష్  Published on  10 Nov 2020 1:25 PM GMT
ప్రధాని మోదీ నేతృత్వంలో భారీ విజయాలు: సీఎం యోగి

దేశ ప్రధాని నరేంద్రమోదీ మార్గదర్శకత్వంలోనే బీహార్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికలల్లో మెరుగైన ఫలితాలు మెరుగైన ఫలితాలు వచ్చాయని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ అన్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ బీహార్‌లో విజయం సాధించిందని అన్నారు. ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమిపై మెరుగైన ఆధిక్యత కనబర్చిందని అన్నారు.

ఇక 243 స్థానాలు కలిగిన బీహార్‌ అసెంబ్లీలో ఎన్డీయే కూటమి 123 స్థానాలకుపైగా ఆదిక్యంతో మేజిక్‌ ఫిగర్‌కు చేరుకుని, మహాకూటమి 112 స్థానాల్లో ముందంజలో ఉండగా, ఇతరులు 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. మరో వైపు యూపీలో జరిగిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో ఆరు స్థానాల్లో బీజేపీ విజయం సాధించడం పట్ల పార్టీ కార్యకర్తలను యోగి అభినందించారు. ఇక మధ్యప్రదేశ్‌, గుజరాత్, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించింది.


Next Story