కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్, బీహార్‌కు వరాలు
పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు.
By Srikanth Gundamalla Published on 23 July 2024 12:14 PM ISTకేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్, బీహార్‌కు వరాలు
పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. వరుసగా ఏడోసారి బడ్జెట్‌ను ప్రవేవపెట్టి రికార్డును నెలకొల్పారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ.. పలు కీలక అంశాలను ప్రకటించారు. ఈ బడ్జెట్ లో ముఖ్యంగా 9 ప్రధాన అంశాలను ఆధారంగా చేసుకుని రూపొందించామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఉపాధి కల్పన, నైపుణ్య శిక్షణ, ఎంఎఎస్‌ఎంఈపై దృష్టి, వాతావరణ మార్పులకు అనుగుణంగా 9 రకాల వంగడాలు అభివృద్ధికి పరిశోధనలు, వ్యవసాయంలో ఉత్పాదకత పెంపు, కూరగాయల ఉత్పత్తి పెంచేందుకు క్లస్టర్లకు ప్రోత్సాహం, స్వయం సమృద్ధి సాధించడం, రాష్ట్రాల భాగస్వామ్యంతో వ్యవసాయం కోసం డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి ప్రోత్సాహం సహా ప్రధానమంత్రి ప్యాకేజీలో భాగంగా ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకాలు వంటి వాటిపై దృష్టి పెట్టామని ఆర్థిక మంత్రి నిర్మల చెప్పారు.
కేంద్రంలో కూటమి ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా ఉన్న ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్ర ప్రభుత్వాలకు వరాలు ప్రకటించారు నిర్మలా సీతారామన్. ఏపీకిరూ.50 వేల కోట్లు అదనంగా ఇస్తామని ప్రకటించగా.. బీహార్‌లో ఎక్స్‌ప్రెస్‌వే నిర్మిస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. అలాగే విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను అమలు చేస్తామన్నారు ప్రత్యేక ఆర్థిక సహకారం అందిస్తామన్నారు. 2024-25 బడ్జెట్ల్ఓ ఏపీ అభివృద్ధి కోసం రూ.15 కోట్లు నిధులు కేటాయించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. పోలవరం పూర్తి చేయడానికి సహాయం అందిస్తామన్నారు. పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రత్యేక రాయితీలు, విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధికి నిధులు ఇస్తామని చెప్పారు. విభజన చట్టంలో పొందుపర్చినట్లు వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం సహా రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్రకు నిధులు కేటాయిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.