వాహనదారులకు గుడ్ న్యూస్
By - Nellutla Kavitha |
వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ లో పెండింగ్ ట్రాఫిక్ చలానా రాయితీ గడువును పొడిగించినట్లు రాష్ట్ర హోం మంత్రి ప్రకటించారు. మార్చి 31తో గడువు ముగుస్తున్నా మరో పదిహేను రోజుల పాటు గడువును పొడిగిస్తున్నామని హోంమంత్రి మహమూద్ అలీ ప్రకటించారు. ప్రజల నుంచి వస్తున్న స్పందన తో పాటుగా విజ్ఞప్తుల మేరకు మరో 15 రోజుల పాటు అంటే, ఏప్రిల్ 15వ తేదీ వరకు పెండింగ్ చలానా లపై రాయితీ అవకాశాన్ని పొడిగించినట్టుగా హోం మంత్రి మహమూద్ అలీ ప్రకటించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు రెండు కోట్ల 40 లక్షల చలానాలు వాహనదారులు చెల్లించారని, దీంతో 250 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్టుగా ప్రకటించారు. ఇప్పటిదాకా చలాన్లు చెల్లించలేక పోయిన వారు ఈ రాయితీ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ-చలాన్ వెబ్సైట్ లో, ఆన్లైన్ పేమెంట్ ద్వారా తమ చలానా క్లియర్ చేసుకోవాల్సిందిగా హోం మంత్రి మహమూద్ అలీ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 52 శాతం మంది మోటార్ వాహన యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని అన్నారు హోం మంత్రి మహమూద్ అలీ.