హైదరాబాద్‌లో ఇక రోజూ శ్రీవారి లడ్డూ విక్రయాలు

హైదరాబాద్‌లో ఉంటోన్న తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్‌న్యూస్ చెప్పింది.

By Srikanth Gundamalla  Published on  8 Sept 2024 10:07 AM IST
హైదరాబాద్‌లో ఇక రోజూ శ్రీవారి లడ్డూ విక్రయాలు

హైదరాబాద్‌లో ఉంటోన్న తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇక నుంచి హైదరాబాద్‌లో ప్రతి రోజూ తిరుమల శ్రీవారి లడ్డూలను విక్రయించనున్నారు. హిమాయత్‌నగర్‌, జూబ్లీహిల్స్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానాల్లో కేవలం శని, ఆదివారాల్లో మాత్రమే ఇప్పటి వరకు శ్రీవారి లడ్డూలను విక్రయించేవారు. కానీ.. భక్తుల కోరిక మేరకు ఇక నుంచి ప్రతిరోజు లడ్డూ ప్రసాదం అందుబాటులో ఉంచనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

శ్రీవారి లడ్డూ జారీలో తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త విధానాన్ని అమలులోకి తెచ్చిందని అధికారులు చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లోని భక్తులకు పవిత్రమైన శ్రీనివాసుడి లడ్డూ ప్రసాదం రోజూ అందజేయాలని నిర్ణయం తీసుకుందన్నారు. ఈ మేరకు ఒక్కో లడ్డూను రూ.50కు విక్రయించనున్నారు. హిమాయ‌త్‌న‌గ‌ర్, జూబ్లీహిల్స్ తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానాల్లో ప్రతి రోజు ఉద‌యం 9 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ల‌డ్డూ విక్రయాలు కొన‌సాగుతాయ‌ని పేర్కొన్నారు. భ‌క్తులు గ‌మ‌నించి, ల‌డ్డూ ప్రసాదాల‌ను కొనుగోలు చేయాల‌ని అధికారులు సూచించారు.

Next Story