అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అధ్యక్షుడిగా జో బైడెన్‌ ఎన్నికయ్యారు. అయితే ఎన్నికల ప్రక్రియ పూర్తయిందా..?అంటే ఇంకా ఉందనే చెప్పాలి. 538 మంది ఎలక్ట్రార్లు అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ ఇంకా చాలా మిగిలి ఉంది.

ఎన్నికలు పూర్తయినా.. కీలక దశలు ఇవే..

అయితే అధ్యక్షుడి ఎన్నికలు పూర్వయినా కీలక దశలు మిగిలి ఉన్నాయి. అమెరికా ప్రజలు నేరుగా అధ్యక్షుడికి ఓటు వేయరు. వారు తమ రాష్ట్రంలో ఎలక్ట్రార్లను ఎన్నుకుంటారు. వీరంతా అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. అయితే ఎన్నికల తర్వాత రాష్ట్రాలు, ఎవరికి ఎన్ని పాపులర్‌ ఓట్లు వచ్చాయో నిర్ణయస్తారు. ఆ తర్వాత గవర్నర్‌ నిర్ధారణ పత్రాలు సమమర్పించాల్సి ఉంటుంది. ఇక డసెంబర్‌ 8న రాష్ట్రా స్థాయి ఎన్నికల వివాదాలు పరిష్కరించేందుకు డిసెంబర్‌ 8 వరకు గడువు ఇస్తారు. ఈ లోపు రీ కౌంటింగ్‌, ఇతర వివాదాలను పూర్తి చేయాలి.

అలాగే డిసెంబర్‌ 14న పేపర్‌ బ్యాలెట్ ద్వారా ఎలక్ట్రార్లు అధ్యక్షుడికి ఓటు వేస్తారు. ఎక్కువ పాపులర్‌ ఓట్లు ఎవరికి వస్తే వారికే ఎలక్ట్రార్లు ఓటేయానలి వాషింగ్టన్‌ డీసీ సహా 33 రాష్ట్రాల్లో నిబంధన ఉంది.

2021, జనవరి 6న ఎలక్టోరల్‌ ఓ్లను లెక్కించేందుకు అమెరికా ఉభయసభలు సమావేశం నిర్వహిస్తాయి. అప్పుడు ఉపాధ్యక్షుడి ఫలితాలను ప్రకటిస్తారు. 270 ఓట్లకన్నా ఎక్కువ వచ్చినవారిని విజేతగా ప్రకటిస్తారు. ఈ ఫలితాలపై అభ్యంతరాలు సైతం వ్యక్తం చేయవచ్చు. వాటిపై రెండు సభలు వేర్వేరుగా చర్చిస్తాయి. తర్వాత సంయుక్త సమావేశం నిర్వహించి అభ్యంతరాలపై ఓటింగ్‌ ఫలితాలు వెల్లడిస్తాయి. ఏ అభ్యర్థి 270 ఎలక్టోరల్‌ ఓట్లను సాధించకపోతే రాజ్యాంగంలోని 12వ సవరణ ప్రకారం అధ్యక్షుడిని కాంగ్రెస్‌ ఎన్నుకుంటుంది. ఇక 2021,జనవరి 20న అధ్యక్షుడిగా ఎన్నికైన అభ్యర్థి ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలను స్వీకరిస్తారు. దీంతో ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. మెగాస్టార్‌ చిరంజీవికి కరోనా పాజిటివ్‌

సుభాష్

.

Next Story