కొండెక్కిన టమాటా ధర, కిలో రూ.100
కొద్దిరోజులుగా టమాటా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.
By Srikanth Gundamalla Published on 18 July 2024 9:25 AM ISTకొండెక్కిన టమాటా ధర, కిలో రూ.100
కొద్దిరోజులుగా టమాటా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రతి కూరలోనూ దాదాపుగా టమాటాను వినియోగిస్తారు. అలాంటి టమాటా ధర అమాంతం పెరిగిపోతుండటంతో వినియోగదారులు కొనాలంటేనే ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో కిలో టమాటా ధర సెంచరీ దాటేసింది. రైతు బజార్లలో కిలో టమాటా ధర రూ.67-70 వరకు ఉండగా బహిరంగ మార్కెట్‌లో రూ.10-110 పలుకుతోంది. ఇక కిలో ఉల్లిగడ్డ ధర నార్మల్ గా అయితే రూ.20-25 ఉండాలి... ఇది కూడా వినియోగదారులకు ఇబ్బందిగా మారింది. రెండు నెలల క్రితం రోడ్డుపక్కన ట్రాలీలో ఆటోలపై రూ.100కి నాలు కిలోలు అమ్మగా.. రైతు బజార్లలో 3 కిలోలు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా కిలో రూ.100 దాటడంతో సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది.
హైదరాబాద్ శివారులోని యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం రైతుల నుంచి మార్కెట్‌లోకి లోకల్ టమాటా కూడా పెద్దగా రావడం లేదు. దాంతో.. ధరలు నగరంలో మరింత పెరిగాయని చెప్పారు. ఏపీలోని మదనపల్లి, రాజస్థాన్ నుంచి నగరానికి వచ్చే టమాటా 60 శాతం తగ్గిపోవడంతో ధరలు పెరిగాయని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. ఇక పలు ప్రాంతాల్లో వర్షాల కారణంగా చేతికి వచ్చిన పంట దెబ్బతింటోంది. దాంతో రూతు బజార్ల నుంచి సూపర్ మార్కెట్ల వరకు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. మరోవైపు ఇతర ప్రాంతాల నుంచి ఆశించిన స్థాయిలో దిగుమతి లేదు. దాంతో.. రిటైల్ మార్కెట్‌లో వ్యాపారులు ఇష్టారాజ్యంగా రేట్లు పెంచి అమ్ముతున్నారంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.