వచ్చే వారం విజయవాడకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి!
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వచ్చే వారం విజయవాడకు వెళ్లనున్నారని తెలుస్తోంది.
By Srikanth Gundamalla
వచ్చే వారం విజయవాడకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి!
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వచ్చే వారం విజయవాడకు వెళ్లనున్నారని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు రేవంత్‌రెడ్డి తిరుమల వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న విషయం తెలిసిందే. అయితే.. ప్రమాణస్వీకారం తర్వాత ఇప్పుడు సీఎం హోదాలో విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుంటారని సమాచారం. ఆ తర్వాత ఏపీ సీఎం జగన్‌తో కూడా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సమావేవం అవుతారని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. కీలక అంశాలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య చర్చ జరుగనుందని సమాచారం. అయితే.. సీఎం రేవంత్‌రెడ్డి ఏపీ పర్యటనపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం తర్వాత ఏపీ సీఎం జగన్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. ఇరు రాష్ట్రాల మధ్య సమన్వయం, పరస్పర సహకారం కొనసాగాలని ఆకాంక్షిస్తూ జగన్ పోస్టు పెట్టారు. దానికి రిప్లై ఇచ్చి రేవంత్‌రెడ్డి తాము కూడా అదే కోరకుంటున్నామని చెప్పారు. మరోవైపు వచచే జూన్ నెలతో హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగాలన్న గడువు ముగియనుంది. నీటి వివాదాలు, పెండింగ్ విభజన అంశాలు ఉన్నాయి. ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశం అయితే ప్రధానంగా ఆయా అంశాలపై చర్చ జరిగే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో రేవంత్‌రెడ్డి విజయవాడ పర్యటన రాజకీయపరంగా ఆసక్తిని రేపుతోంది.