మేమూ సహకారమే కోరుకుంటున్నాం.. ఏపీ సీఎం జగన్‌కు రేవంత్‌రెడ్డి రిప్లై
తెలంగాణ కొత్త సీఎంగా రేవంత్‌రెడ్డి గురువారం ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 8 Dec 2023 11:53 AM ISTమేమూ సహకారమే కోరుకుంటున్నాం.. ఏపీ సీఎం జగన్‌కు రేవంత్‌రెడ్డి రిప్లై
తెలంగాణ కొత్త సీఎంగా రేవంత్‌రెడ్డి గురువారం ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు 11 మంది మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేశారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీతో పాటుగా.. పొరుగు రాష్ట్రం ఏపీ సీఎం జగన్ కూడా కంగ్రాట్స్ చెప్పారు. ఈ మేరకు సీఎం జగన్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్టు పెట్టారు. తాజగా సీఎం జగన్ పోస్టుకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి రిప్లై ఇచ్చారు.
తెలంగాన కొత్త సీఎం రేవంత్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం జగన్.. మంత్రులకు కూడా శుభాకాంక్షలు చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం ఫరిడవిల్లాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ ట్వీట్‌పై స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌తో పాటు పొరుగు రాష్ట్రాలతో స్నేహభావం, అభివృద్ధిలో పరస్పర సహకారాన్ని తమ ప్రభుత్వం కూడా ఆకాంక్షిస్తోందని రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు ట్వీట్ చేస్తూ.. ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం జగన్‌కు రేవంత్ ధన్యవాదాలు తెలిపారు.
ప్రభుత్వంలోకి వచ్చిన మొదటిరోజే సీఎం రేవంత్‌రెడ్డి ప్రజాభవన్‌లో ప్రజాదర్బార్ నిర్వహించారు. వైఎస్సార్ హయాంలో ఉన్న ఈ ప్రజాదర్బార్ మరోసారి రేవంత్‌రెడ్డి తీసుచ్చారు. నేరుగా సీఎంతో పాటు.. మంత్రులు పాల్గొనడం వైఎస్సార్ తర్వాత ఇదే తొలిసారి. అయితే.. ప్రజాదర్బార్ లో తమ అర్జీలను పెట్టుకునేందుకు ప్రజాభవన్‌కు జనాలు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో ప్రజల పేర్లు నమోదు చేసుకుని ప్రజాభవన్‌లోకి అర్జీలను అనుమతి ఇచ్చారు అధికారులు. మరోవైపు రేపట్నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌తో సమావేశం అయ్యి.. వివిధ అంశాలపై చర్చించనున్నారు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.
శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. సాటి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ తో పాటు, పొరుగు రాష్ట్రాలతో స్నేహభావం… అభివృద్ధిలో పరస్పర సహకారాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది. https://t.co/UsR4GyPqDR
— Revanth Reddy (@revanth_anumula) December 8, 2023