దావోస్‌లో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి బిజీబిజీ
దావోస్ చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పలువురు ప్రముఖులతో వరుసగా సమావేశం అయ్యారు.
By Srikanth Gundamalla Published on 16 Jan 2024 8:15 AM GMTదావోస్‌లో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి బిజీబిజీ
దావోస్‌లో మూడు రోజుల పాటు 54వ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సు జరగనుంది. ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా తెలంగాణ ప్రభుత్వం ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. సోమవారం దావోస్ చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పలువురు ప్రముఖులతో వరుసగా సమావేశం అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని వారికి ఆహ్వానం పలికార. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు, అధికారులు కూడా ఈ టూర్‌లో ఉన్నారు.
దావోస్‌లో సీఎం రేవంత్‌రెడ్డి తన బృందంతో కలిసి ఇథియోఫియా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ డెమెక్ హసెంటోతో సమావేశం అయ్యారు. పారిశ్రామిక అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంచుకున్న రూట్‌మ్యాప్‌పై వారితో సీఎం రేవంత్‌రెడ్డి చర్చించారు. అలాగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బోర్గోబెండేతో కూడా సీఎం రేవంత్ సమావేశం అయ్యారు. ఇతర ప్రముఖులతో జరిగిన సమావేశంలో కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనీ.. వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం ఉంటుందనే విషయాలను వివరించారు. తెలంగాణలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందనీ.. కొత్త ప్రభుత్వ ఆలోచనలు పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల వాతావరణాన్ని ఏర్పాటు కార్యక్రమాలను కూడా ప్రతినిధులకు సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు.
స్విట్జర్లాండ్‌లోని జూరిచ్ ఎయిర్‌పోర్టులోనే ప్రవాసీ తెలంగాణ ప్రముఖులతో సీఎం రేవంత్‌రెడ్డి బృందం చర్చలు జరిపింది. సమ్మిళిత, సంతులిత అభివృద్ధి ద్వారా ప్రజలందరి పురోగతి కోసం నవ తెలంగాణ నిర్మాణంలో భాగమయ్యేందుకు వారం మొగ్గు చూపారని సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్ వేదికగా తెలిపారు. అలాగే.. తెలంగాణలో ఉన్న వనరులు పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణాన్ని పారిశ్రామికవేత్తలకు వివరిస్తున్నారు. తెలంగాణలో భారీ పెట్టుబడులే లక్ష్యంగా ఈ టూర్ సాగుతోందనీ తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.