రేపు తెలంగాణ క్యాబినెట్ భేటి

By -  Nellutla Kavitha |  Published on  11 April 2022 12:37 PM GMT
రేపు తెలంగాణ క్యాబినెట్ భేటి

తెలంగాణ కేబినెట్ రేపు అత్యవసరంగా సమావేశంకానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో ఈ సమావేశం జరుగుతుంది. యాసంగి కొనుగోలుపై కేంద్రానికి కేసీఆర్ 24 గంటల డెడ్‌ లైన్‌ పెట్టారు సీయం. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కేంద్రం కొంటుందో, లేదో 24 గంటల్లో తేల్చాలని ముఖ్యమంత్రి ఈరోజు కేంద్రానికి డెడ్ లైన్ విధించారు.

ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌లో కేసీఆర్ చేపట్టిన దీక్షలో వరి ధాన్యం కొనుగోలు కేంద్ర ప్రభుత్వమే చేయాలని నిర్ణయించారు. దీనిపై రేపు కేబినెట్‌‌లో చర్చించి ప్రకటన చేయనున్నారు. కేంద్రంపై పోరును టీఆర్ఎస్ మరింత ఉధృతం చేయాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ స్పందనను బట్టి ఏ విధంగా ముందుకెళ్లాలన్న అంశంపై కేబినెట్ లో కేసీఆర్ మంత్రులతో చర్చించే అవకాశం ఉంది. వారం రోజలుగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహించిన TRS, ఈరోజు ఢిల్లీ కేంద్రంగా రైతు నిరసన దీక్ష చేపట్టింది. తెలంగాణ రైతులు పండించిన యాసంగి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని, కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. పదిరోజులపాటు ఢిల్లీలో పర్యటించిన సీయం ఈరోజు హైదరాబాద్ బయలుదేరి రానున్నారు.

Next Story