తమన్నాకు కోపం వచ్చింది.. ఆమెను అలా అన్నందుకు..

Tamanna Serious About Trolls. మిల్కీ బ్యూటీ తమన్నా ఆహా కోసం ఒక ప్రాజెక్ట్ చేస్తుందంటూ వచ్చిన వార్తలు నిజమయ్యాయి.

By Medi Samrat  Published on  11 Nov 2020 4:45 AM GMT
తమన్నాకు కోపం వచ్చింది.. ఆమెను అలా అన్నందుకు..

మిల్కీ బ్యూటీ తమన్నా ఆహా కోసం ఒక ప్రాజెక్ట్ చేస్తుందంటూ వచ్చిన వార్తలు నిజమయ్యాయి. ఆహా తమన్నా ప్రాజెక్ట్ ను అధికారికంగా అనౌన్స్ చేసింది. 11th అవర్ అనే టైటిల్ తో ఈ వెబ్ సిరీస్ ను విలక్షణ దర్శకుడిగా గుర్తింపు ఉన్న ప్రవీణ్ సత్తార్ రూపొందించాడు. ఇందుకు సంబంధించిన ప్రమోషన్స్ మొదలయ్యాయి.

ఈ సందర్భంగా తమన్నా కొన్ని విషయాలను షేర్ చేసుకుంది. తమన్నా ఇటీవలే కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. తాను కరోనా బారినపడి కోలుకున్న తర్వాత కొంచెం బరువు పెరిగానని, దానిపైనా కొందరు వ్యాఖ్యలు చేశారని. ఆ వ్యాఖ్యలు తనకు బాధగా అనిపించాయని తెలిపింది.

కరోనా చికిత్సకు వాడిన మందులతో లావయ్యానని, ఆ సమయంలో తాను ఓ ఫొటో చేర్ చేస్తే అది చూసి లావుగా ఉన్నావు అన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతరుల గురించి వ్యాఖ్యలు చేసే ముందు వారికి ఏమైంది అని ఏమాత్రం ఆలోచించరా? అని తమన్నా ప్రశ్నించారు. కరోనా పాజిటివ్ అని తెలియగానే భయపడ్డానని, చికిత్స పొందుతున్న సమయంలో చచ్చిపోతానన్న ఆలోచనలతో ఆందోళనకు గురయ్యానని వెల్లడించారు.

అయితే డాక్టర్ల చలవతో బతికి బయటపడ్డానని, ఈ కష్ట సమయంలో తల్లిదండ్రులు ఎంతో అండగా నిలిచారని కృతజ్ఞతలు తెలిపారు. ఎంతో మంది సెలెబ్రిటీలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి కూడా ఇటీవలే కరోనా బారిన పడ్డారు.


Next Story