దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఫలితం కోసం అన్ని పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఇప్పటి వరకూ తొమ్మిది రౌండ్లు పూర్తయ్యాయి. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ముందంజలో ఉన్నారు. కాగా టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత రెండో స్థానంలో ఉన్నారు.
హరీష్ రావు దత్తత గ్రామం అయిన చీకుడులో టిఆర్ఎస్ కు 744 ఓట్లు రాగా, బీజేపీ కి 766 ఓట్లు వచ్చాయి. మొదటి నుండి ఆధిక్యంలో కొనసాగుతన్న బీజేపీ చీకుడులో 22 ఓట్ల ఆధిక్యం సాధించి.. హరీష్ రావుకు, ఇటు టీఆర్ఎస్ శ్రేణులకు ఊహించని షాక్ ఇచ్చింది. కౌంటింగ్‌లో రౌండ్ రౌండ్‌కూ ఆధిక్యాలు మారిపోతున్నాయి. 9వ రౌండ్‌లో కూడా బీజేపీకే ఆధిక్యం వచ్చింది. 1084 ఓట్లు ఈ రౌండ్‌లో బీజేపీ అభ్యర్థికి ఆధిక్యం వచ్చింది. 9వ రౌండ్‌లో మొత్తం బీజేపీకి 3,413, టీఆర్ఎస్ కు 2,329, కాంగ్రెస్ కు 675 ఓట్లు వచ్చాయి. ఇప్పటి వరకూ 4,190 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి ఉన్నారు.