Hyderabad: ఇఫ్లూలో విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. నిందితులను అరెస్ట్‌ చేయాలని విద్యార్థుల ఆందోళన

ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్శిటీ విద్యార్థిని బుధవారం అర్థరాత్రి లైంగిక వేధింపులకు గురైంది. దీంతో విద్యార్థులు క్యాంపస్‌లో బైఠాయించి ఆందోళనకు దిగారు.

By అంజి  Published on  20 Oct 2023 6:10 AM GMT
Hyderabad, EFLU, Students protest,  SPARSH

Hyderabad: ఇఫ్లూలో విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. నిందితులను అరెస్ట్‌ చేయాలని విద్యార్థుల ఆందోళన

ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్శిటీ (EFLU) విద్యార్థిని బుధవారం అర్థరాత్రి లైంగిక వేధింపులకు గురైంది. యూనివర్సిటీలో SPARSH (సెన్సిటైజేషన్, ప్రివెన్షన్ అండ్ రిడ్రెసల్ ఆఫ్ సెక్సువల్ వేధింపులు) కమిటీని ఎన్నికల ద్వారా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు నిరసన ప్రదర్శనల చేసిన కొన్ని గంటల తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. మహిళా విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఆరోపణలపై గురువారం ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్శిటీ (ఇఎఫ్‌ఎల్‌యు) క్యాంపస్‌లో భారీ నిరసన జరిగింది. బాధితురాలిపై ఇద్దరు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, వారిని గుర్తించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. భరోసా కౌన్సెలింగ్ సెంటర్‌లోని విద్యార్థిని నుండి స్టేట్‌మెంట్ తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఆమె స్టేట్మెంట్స్ ప్రకారం కేసులు బుక్ చేసామన్నారు. నిందితులను గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పి.ఆంజనేయులు తెలిపారు.

విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో పాత ఆరోగ్య కేంద్రం సమీపంలో పీజీ విద్యార్థినిపై ఇద్దరు వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. భౌతికంగా దాడి చేశారు. నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం తెల్లవారుజామున 4 గంటల నుంచి క్యాంపస్‌లో 400 మందికి పైగా విద్యార్థులు ఆందోళనకు దిగారు.

హైదరాబాద్‌లోని ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ విద్యార్థులు తీవ్రంగా ఖండిస్తున్నామని విద్యార్థులు తెలిపారు. క్యాంపస్‌లో జరిగిన దారుణ ఘటన ఇదని తెలిపారు. ఈ సంఘటన అక్టోబర్ 18, 2023, బుధవారం రాత్రి 10 గంటల సమయంలో, గేట్ నంబర్ 3 సమీపంలోని పాత డిస్పెన్సరీ భవనం వద్ద జరిగింది. బాధితురాలిని ఇద్దరు విద్యార్థులు అపస్మారక స్థితిలో గుర్తించి యూనివర్సిటీ ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. ప్రాణాలతో బయటపడిన అమ్మాయి మాట్లాడుతూ నిందితులు బెదిరించారని తెలిపింది. ఆరోగ్య కేంద్రం అధికారులు ఈ విషయాన్ని సున్నితత్వంతో వ్యవహరించడమే కాకుండా, విషయాన్ని బయటపెట్టకూడదని కోరారు.

అన్ని రకాల లైంగిక వేధింపులు మరియు హింసకు వ్యతిరేకంగా సురక్షితమైన స్థలాన్ని కోరుతూ స్పర్ష్ (సెన్సిటైజేషన్, ప్రివెన్షన్, అండ్ రిడ్రెస్సల్ ఆఫ్ సెక్సువల్ వేధింపు) కమిటీ ఎన్నికల కోసం విద్యార్థులు 24 గంటలకు పైగా శాంతియుతంగా నిరసన తెలిపిన ఒక రోజు తర్వాత ఈ సంఘటన జరిగింది. అక్టోబరు 18 సాయంత్రం న్యూ అకడమిక్ బ్లాక్‌లో సంబంధం లేని సాకుతో విద్యార్థులను తరగతి గదుల్లోకి రాకుండా అడ్డుకున్నారు. పోలీసులను క్యాంపస్‌కు పిలిపించి, క్యాంపస్ సెక్యూరిటీ గార్డులతో కలిసి విద్యార్థులను బలవంతంగా బయటకు పంపించారు. అక్టోబర్ 19వ తేదీ గురువారం తెల్లవారుజామున 4.20 గంటల ప్రాంతంలో పరిస్థితిని తెలుసుకున్న విద్యార్థి సంఘం పెద్ద ఎత్తున చేరుకున్నారు. నిందితులను వెంటనే పట్టుకుని, శిక్షించాలని డిమాండ్ చేశారు.

విద్యార్థుల భద్రతలో ఎన్నో లోపాలు ఉన్నాయని న్యాయమైన విచారణ జరగడానికి వైస్-ఛాన్సలర్, మొత్తం ప్రొక్టోరియల్ బోర్డు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు విద్యార్థులు. ప్రాక్టర్ ఉదయం 5.00 గంటలకు విద్యార్థులతో మాట్లాడాడు. CCTV ఫుటేజీని యాక్సెస్ చేయలేమని పేర్కొన్నారు. ప్రోక్టర్ దీనిని "చిన్న సంఘటన"గా ప్రస్తావించడంతో విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెల్లవారుజామున 5.30 గంటలకు అక్కడికి చేరుకున్న హైదరాబాద్ సిటీ పోలీసులు శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులను చెదరగొట్టారు. వీధి దీపాలు, కెమెరాలు సరిగా లేకపోవడంతో నేరస్తులకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు అందుబాటులో లేవని తేలింది. సాయంత్రం 4.20 గంటలకు, ప్రొక్టోరియల్ బోర్డు, వైస్-ఛాన్సలర్ నుండి ప్రతిస్పందన తెలుసుకోడానికి విద్యార్థులు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌కు వెళ్లారు. మూడు గంటలైనా విద్యార్థులతో మాట్లాడేందుకు వైస్‌ ఛాన్సలర్‌, ప్రొక్టర్‌ రాలేదు. అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ దగ్గర పోలీసు కార్లు పార్క్ చేశారు. సెక్యూరిటీ గార్డులు కూడా విద్యార్థులను బెదిరించే ప్రయత్నం చేశారు.

అక్టోబరు 20వ తేదీ తెల్లవారుజామున 1.00 గంటలకు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులను బెదిరించేందుకు ప్రయత్నాలు జరిగాయి. విద్యార్థులను పోలీసులు వెంటనే చెదరగొట్టాలని ప్రయత్నించారు. ముగ్గురు పోలీసు అధికారులు ఒక పిల్లాడిని ఎంచుకుని, అతన్ని అదుపులోకి తీసుకోడానికి ప్రయత్నించారు. విద్యార్థులను భయాందోళనకు గురిచేసి పరుగెత్తేలా చేశారు. కొంతమంది విద్యార్థినులను పోలీసులు మరింత భయపెట్టారు. దాదాపు 15 నిమిషాల్లో, వైస్-ఛాన్సలర్, ప్రొక్టర్ పోలీసుల సహాయంతో క్యాంపస్ నుండి వెళ్లిపోయారు. విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని.. న్యాయం చేయాలని కోరుతున్నారు విద్యార్థులు.

Next Story