ముగిసిన సంక్రాంతి.. బిజీగా హైదరాబాద్ రూట్

సంక్రాంతి సందర్భంగా ఖాళీగా దర్శనమిచ్చిన హైదరాబాద్ రోడ్లు మళ్లీ బిజీగా మారనున్నాయి. సంక్రాంతి పండక్కి సొంతూళ్లకు వెళ్లిన వారంత తిరుగు ప్రయాణమయ్యారు.

By Knakam Karthik  Published on  16 Jan 2025 1:25 PM IST
Sankranti, festival, ap, Telangana, hyd, traffic

ముగిసిన సంక్రాంతి.. బిజీగా హైదరాబాద్ రూట్

సంక్రాంతి సందర్భంగా ఖాళీగా దర్శనమిచ్చిన హైదరాబాద్ రోడ్లు మళ్లీ బిజీగా మారనున్నాయి. సంక్రాంతి పండక్కి సొంతూళ్లకు వెళ్లిన వారంత తిరుగు ప్రయాణమయ్యారు. దాంతో హైదరాబాద్ సిటీకి వచ్చే జాతీయ రహదారులన్నీ.. వాహనాల వరుసలతో కిటకిటలాడుతున్నాయి. ఆంధ్ర నుంచి హైదరాబాద్ వైపు భారీగా వాహనాలు వస్తుండటంతో టోల్ ప్లాజాల వద్ద భారీగా వాహనాల రద్దీ ఉంది.

ట్రాఫిక్‌కు తోడు టోల్ ప్లాజాల వద్ద స్కానర్లు, సర్వర్లు పని చేయకపోవడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడంలేదు. నాలుగు రోజులు ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి ఉపశమనం పొంది సంక్రాంతిని ఎంజాయ్ చేసిన వారు, మళ్లీ రొటీన్ లైఫ్‌ను గడిపేందుకు సిటీకి క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వాహనాల రద్దీ ఏర్పడి, సర్వర్లు మొరాయించకుండా టోల్ ప్లాజా సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హ్యాండ్ గన్స్‌తో వాహనాలను స్కాన్ చేస్తూ వాహనాలను ముందుకు పంపించి వేస్తున్నారు. పండుగకు వెళ్లి వస్తోన్న ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు.

Next Story