తెలంగాణ ప్రజలకు ఆర్టీసీ షాక్
ఆర్టీసీ యాజమాన్యం పండుగ వేళ తెలంగాణ ప్రజలకు షాక్ ఇచ్చింది.
By Kalasani Durgapraveen
ఆర్టీసీ యాజమాన్యం పండుగ వేళ తెలంగాణ ప్రజలకు షాక్ ఇచ్చింది. దసరా వేళ స్పెషల్ బస్సుల పేరుతో ప్రయాణికుల జేబులకు చిల్లు పెట్టేందుకు సిద్ధమైంది. దసరా రద్దీ దృష్ట్యా స్పెషల్ బస్సులు నడుపుతున్నామని ప్రకటించిన ఆర్టీసీ బస్సుల్లో ప్రత్యేక ఛార్జీలు ఉంటాయని స్పష్టం చేసింది. దసరా పండుగ కు ప్రత్యేకంగా 6,300 బస్సులు నడుపుతున్నామని ఆర్టీసీ ఎంపీ సజ్జనార్ ప్రకటించారు. మహాలక్ష్మి స్కీమ్ కింద 600 బస్సులను అదనంగా నడిపిస్తున్నామన్నారు. స్సెషల్ బస్సుల్లో అదనపు ఛార్జీలు ఉంటాయని సజ్జనార్ స్పష్టం తెలిపారు. రిటర్న్ జర్నీలో ఖాళీగా బస్సులు రావాల్సి ఉంటుందని అందుకే అదనపు ఛార్జీలు పెంచడం జరిగిందన్నారు. ఇప్పటికే కొన్ని బస్సులు నడుస్తున్నాయని గురువారం నుంచి మొత్తం బస్సులను నడిపిస్తామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ నెల 14వ తేదీ వరకు ఈ స్పెషల్ బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. మహాలక్ష్మీ పథకంలో భాగంగా ఫ్రీ జర్నీ చేసే మహిళలు తప్పకుండా తమ ఆధార్ కార్డు చూపించాలని స్పష్టం చేశారు. .దసరా సందర్భంగా నగరంలోని ప్రజలు తమ తమ సొంత ఊర్లకు పయనం అవుతున్నారు.అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించింది . దీంతో హాస్టళ్లలో ఉండి చదువుకునే కాలేజీ విద్యార్థులంతా తమ ఊర్లకు బయలుదేరారు. దీంతో బస్సుల్లో విపరీతమైన రద్దీ పెరిగింది. ప్రయాణికులకు సరిపడా బస్సులు లేవని ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రజలకు సరిపడ్డ బస్సులను నడపాలని ఆర్టీసీ యాజమాన్యానికి ప్రయాణికులు కోరుతున్నారు .