రోప్ వే ప్రమాదం - 24 గంటలుగా గాల్లోనే యాత్రికులు

By -  Nellutla Kavitha |  Published on  11 April 2022 12:06 PM GMT
రోప్ వే ప్రమాదం - 24 గంటలుగా గాల్లోనే యాత్రికులు

ఝార్ఖండ్, దేవ్ గఢ్ జిల్లాలోని త్రికూట పర్వతాల్లో రోప్ వే ప్రమాదం జరిగింది. రామనవమి సందర్భంగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు - త్రిమూర్తులు కొలువైన త్రికూట్ పర్వతంపై దర్శనానికి వెళ్లారు. అయితే నిన్న రెండు కేబుల్ కార్లు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వైర్లు తెగిపోగా ఇద్దరు యాత్రీకులు ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. 40 మందికి పైగా యాత్రికులు 20 గంటలకుపైగా గాల్లోనే చిక్కుకుపోయారు.

త్రికూట్ పర్వతాలపైకి వెళ్లటానికి సరైన మార్గం లేకపోవటంతో రోప్ వేను ఉపయోగిస్తారు. శ్రీరామ నవమి సందర్భంగా భక్తులు త్రికూట్ పర్వతానికి పోటెత్తారు. అయితే రోప్ వే వైర్లు తెగిపోవటంతో మరోదారి లేక త్రికూట్ కొండల్లోనే చిక్కుకుపోయారు యాత్రికులు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. వీరికి తోడు ఎయిర్ ఫోర్స్ కూడా రంగంలోకి దిగింది.

MI 17 హెలికాప్టర్లు రక్షణ చర్యల్లో పాల్గొంటున్నాయి. యాత్రీకులను సురక్షితంగా తరలించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు ఉన్నతాధికారులు. 766 మీటర్ల పొడవుండే ఈ త్రికూట్ రోప్ వే, 392 మీ. ఎత్తుతో భారత్ లోనే ఎత్తైన రోప్ వే. 25 క్యాబిన్లతో, ఒక్కో దాంట్లో నలుగురు ప్రయాణించేందుకు వీలుంటుంది. ఇప్పటికే 20 మందిని రెస్క్యూ చేసింది టీం. అయితే నిన్నటి నుంచి ఆహారం, నీరు లేకుండా గాలిలోనే వేలాడుతున్న మిగితా యాత్రికులనందరినీ కూడా ఈ సాయంత్రం కల్లా కిందకు దించుతామని జార్ఘండ్ ప్రభుత్వం ప్రకటించింది. సాంకేతిక లోపంతోనే ప్రమాదం జరిగిందంటున్నారు అధికారులు.

Next Story