భారతీయ విద్యార్థులకు ఫాన్స్‌ అధ్యక్షుడు గుడ్‌న్యూస్

భారత గణతంత్ర వేడుకల్లో ముఖ్యఅతిథిగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మెక్రాన్‌ పాల్గొన్నారు.

By Srikanth Gundamalla  Published on  26 Jan 2024 1:09 PM IST
republic day, delhi, france president, macron,

భారతీయ విద్యార్థులకు ఫాన్స్‌ అధ్యక్షుడు గుడ్‌న్యూస్

భారత గణతంత్ర వేడుకల్లో ముఖ్యఅతిథిగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మెక్రాన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన భారతీయ విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. భారతీయ విద్యార్తులకు ఎక్కువ మంది ఫ్రాన్స్‌లో చదువుకునే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 2030 నాటికి దాదాపు 30 వేల మంది ఇండియన్ స్టూడెంట్స్‌ను ఆహ్వానించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇమాన్యుయేల్‌ మెక్రాన్‌ చెప్పారు.

అలాగే భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్‌ అందించే తోడ్పాటు గురించి కూడా అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మెక్రాన్‌ వివరించారు. ఫ్రెంచ్ మాట్లాడలేని విద్యార్థుల కోసం యూనివర్సిటీల్లో ప్రత్యేకంగా అంతర్జాతీయ తరగతులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. వివిధ సంస్థల భాగస్వామ్యంతో ఒక నెట్‌వర్క్‌ను సృష్టిస్తామని వెల్లడించారు. ఫ్రాన్స్‌లో చదవిన పూర్వ విద్యార్థులకు వీసా సదుపాయం కల్పిస్తామంటూ శుభవార్త చెప్పారు మెక్రాన్. భారత్‌లో ఫ్రాన్స్ అద్యక్షుడు రెండ్రోజుల పర్యటనకు వచ్చారు. గురువారం ఆయన ప్రత్యేక విమానంలో జైపూర్‌కు వెళ్లారు. ఇక అక్కడి నుంచి ఢిల్లీకి వచ్చి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

భారత్‌, ఫ్రాన్స్‌ మధ్య సంబంధాల గురించి కూడా ఆయన వ్యాఖ్యానించారు. రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకుందామని పిలుపునిచ్చారు. ఫ్రెంచ్‌ ఫర్‌ ఆల్‌, ఫ్రెంచ్‌ ఫర్‌ ఎ బెటర్ ఫ్యూచర్ చొరవతో ఫ్రెంచ్‌ నేర్చుకోవడానికి నెట్‌వర్క్‌ సృష్టిస్తామన్నారు.


Next Story