వ్యాక్సిన్లు తీసుకున్నా కరోనా కేసులు ఎందుకు పెరుగుతున్నాయి?!

By -  Nellutla Kavitha |  Published on  17 March 2022 2:14 PM GMT
వ్యాక్సిన్లు తీసుకున్నా కరోనా కేసులు ఎందుకు పెరుగుతున్నాయి?!

కొన్ని వారాల పాటు కరోనా పాజిటివ్ కేసులు తగ్గినట్టే కనిపించినప్పటికీ సడన్ గా ఎందుకు పెరుగుతున్నాయి? 90% వ్యాక్సిన్లు తీసుకున్నటువంటి చైనాతో పాటు, ఇతర ఆసియా దేశాలు, యూరప్ లో కూడా కేసులు పెరగడానికి కారణం ఏమిటి? భారతదేశంలోనూ ఫోర్త్ వేవ్ రాబోతోందా? వ్యాక్సిన్ ల ప్రభావం ఎంతమేరకు ఉంది? అసలు కరోనాకు అంతం లేదా? ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెబుతుందో ఇప్పుడు చూద్దాం.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి మరియా వాన్ చెబుతున్న దాన్ని బట్టి ప్రపంచవ్యాప్తంగా గత వారం రోజుల్లో 8 శాతం మేరకు కేసుల సంఖ్య పెరిగితే, మరణాల సంఖ్య 17 శాతం తగ్గింది. ఇప్పుడు నమోదవుతున్న కేసుల్లో 99.9% ఒమైక్రాన్ కేసులు గానే ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు చెబుతున్నాయి. ఓమైక్రాన్ లోని BA.1, BA.2 వేరియంట్ల వల్లే కేసులు పెరుగుతున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ఓమైక్రాన్ వేగంగా వ్యాప్తి చెందడం వల్లే ఇంతలా కేసులు వస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి మరియ చెబుతున్నారు. దీనితో పాటుగా కేసులు వెలుగు చూస్తున్న దేశాల COVID ప్రోటోకాల్స్ పాటించకపోవడం, ఆంక్షలుఎత్తివేయడం వల్లే కేసుల సంఖ్య పెరిగిందని మరియ చెబుతున్నారు. వ్యాక్సిన్లు తీసుకోవడం వల్ల మరణాల సంఖ్య తగ్గిందని, అయితే వ్యాప్తి మాత్రం ఉందని అంటున్నారు మరియ. కరోనా వ్యాక్సిన్ లు తీవ్ర అనారోగ్యం ని కట్టడి చేస్తున్నాయని, మరణాల సంఖ్య తగ్గిస్తాయని, అయితే వ్యాప్తిని మాత్రం అరికట్టలేక పోతున్నాయని అంటున్నారు. ఇక మరణాల విషయానికి వస్తే కొన్ని ప్రాంతాల్లో 60 ఏళ్లు పైబడిన వారిలో, ఇతర వ్యాధులు ఉన్నవారిలో, హైరిస్క్ గ్రూపుల్లో కరోనా మరణాలు ఎక్కువగా ఉన్నట్టు గా లెక్కలు చెబుతున్నాయి. ఆఫ్రికా లాంటి దేశాల్లో టీకాల లభ్యత సరిగా లేకపోవడం, మిస్ ఇన్ఫర్మేషన్ వల్ల హైరిస్క్ గ్రూప్ ఇప్పటికీ వాక్సిన్ లకు దూరంగా ఉందని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది.

మరో ముఖ్యమైన ప్రధాన కారణం ఓమైక్రాన్ తరవాత ఇంకొక వేరియంట్ రాదనే ప్రచారం జరగడం, కరోనా పాండమిక్ గా మారుతుందని, ఒమైక్రాన్ మైల్డ్ గానే ఉంటుందని, కరోనాతో సహజీవనం తప్పదనే సమాచారంతో జాగ్రత్తలు తీసుకోవడం మానేశారని డబ్ల్యూహెచ్ఓ అభిప్రాయపడుతోంది. అయితే ఇప్పటికీ కరోనా వల్ల మరణిస్తున్న వారిలో చాలావరకూ వ్యాక్సిన్లను తీసుకొని వారే ఉన్నట్టుగా డబ్ల్యూహెచ్ఓ గుర్తించింది. వాక్సిన్లను పూర్తిగా తీసుకోవడంతో మరణాల ని అరికట్టడంతో పాటుగా, ఇతర సమస్యలు రాకుండా చూసుకోవచ్చు అంటున్నారు. యునైటెడ్ నేషన్స్ హెల్త్ ఏజెన్సీ డేటా ప్రకారం గత 30 రోజుల్లో నాలుగు లక్షల శాంపిల్స్ సీక్వెన్స్సింగ్ చేస్తే అందులో 99.9% కేసులు ఒమైక్రాన్ వే ఉన్నాయి.

బయటకు వెళ్ళినప్పుడు మాస్కులు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం వల్లే వైరస్ వ్యాప్తి చెందుతుందని, ఇప్పటికీ కరోనా అంతం అవలేదని, కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించాల్సిన అవసరం ఉందని డబ్ల్యూహెచ్ఓ నిపుణులు చెబుతున్నారు. ఒక్కో దేశంలో ఒక్కొక్క రకమైన పరిస్థితులు ఉన్నప్పటికీ, కరోనా పాండమిక్ ఇప్పటికీ ఎండ మిక్ గా మారలేదు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. జనాభాకు తగ్గట్టుగా వ్యాక్సిన్లను తీసుకోవడంతో పాటుగా, టెస్టులు, సీక్వెన్స్సింగ్, సరైన వెంటిలేషన్ పై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని మరియ సూచిస్తున్నారు.

Next Story