చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా రాజీవ్ కుమార్
By - Nellutla Kavitha | Published on 12 May 2022 12:23 PM GMTఈనెల 14 వరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రస్తుత కమిషనర్ గా ఉన్న సుశీల్ చంద్ర పదవీ కాలం ముగుస్తుంది. దీంతో ఆయన స్థానంలో భారత ఎన్నికల ప్రధాన అధికారిగా రాజీవ్ కుమార్ ను నియమించింది. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖఈరోజు నోటిఫికేషన్ జారీచేసింది. ఈ సందర్భంగా కేంద్ర న్యాయశాఖకా మంత్రి కిరణ్ రిజిజు రాజీవ్ కు అభినందనలు తెలిపారు. ఈనెల 15న రాజీవ్ కుమార్ ప్రధాన ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు.
సీఈసీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1984 బ్యాచ్ ఝార్ఖండ్ కు చెందిన రాజీవ్ కుమార్ 2020 కేంద్ర ఎన్నికల సంఘంలో కమీషనర్‌గా పనిచేసారు. గతంలో ఆర్ధిక శాఖ కార్యదర్శిగా, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ సెలక్షన్ బోర్డు చైర్మన్ గా కూడా ఆయన వ్వవహరించారు.
Next Story