దేశాభివృద్ధికి తెలంగాణ అందించిన సహకారం గర్వకారణం: ప్రధాని మోదీ

తెలంగాణ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

By Srikanth Gundamalla  Published on  2 Jun 2024 8:00 AM GMT
pm modi,   telangana, state formation day,

దేశాభివృద్ధికి తెలంగాణ అందించిన సహకారం గర్వకారణం: ప్రధాని మోదీ

తెలంగాణ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎక్స్‌వేదికగా ఒక పోస్టు పెట్టారు. తెలంగాణ రాష్ట్రం, దేశాభివృద్ధికి అందించిన సహకారం ప్రతి భారతీయుడికీ గర్వకారణమని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి గొప్ప చరిత్ర, విశిష్టమైన సంస్కృతి ఈ రాష్ట్ర ప్రత్యేకతలు అని చెప్పారు. ఇక రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంటుందని.. తోడ్పాటు అందిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు.

ఒక మరోవైపు కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ కూడా రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు సోనియాగాంధీ రావాల్సి ఉంది.. కానీ అనారోగ్యం కారణంగా వైద్యుల సూచనతో ఆమె హైదరాబాద్ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఈ వీడియో సందేశాన్ని పంపారు.

తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని సోనియాగాంధీ చెప్పారు. సీఎం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో గ్యారెంటీలను అమలు చేస్తామని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర స్వప్నాన్ని నేరవేరుస్తామని 2004లో కరీంనగర్ సభలో హామీ ఇచ్చామన్నారు. గడిచిన పదేళ్లుగా ప్రజలు కాంగ్రస్‌ పట్ల అత్యంత ప్రేమ, అభిమానం చూపారని సోనియాగాంధీ అన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రజల సంక్షేమానికి, అబివృద్ధికి కృషి చేస్తామన్నారు. కాగా.. సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్లి సోనియాగాంధీని తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనాలని ఆహ్వానించిన విషయం తెలిసిందే.

Next Story