అప‌చారం : ఎస్వీబీసీలో పోర్న్‌సైట్‌ లింక్ కలకలం

Porn Link Hulchul In SVBC. తిరుమల ఎస్వీబీసీలో పోర్న్‌సైట్‌ లింక్ కలకలం రేపింది. శతమానం భవతి కార్యక్రమం కోసం ఓ భక్తుడు

By Medi Samrat  Published on  11 Nov 2020 5:20 AM GMT
అప‌చారం : ఎస్వీబీసీలో పోర్న్‌సైట్‌ లింక్ కలకలం

తిరుమల ఎస్వీబీసీలో పోర్న్‌సైట్‌ లింక్ కలకలం రేపింది. శతమానం భవతి కార్యక్రమం కోసం ఓ భక్తుడు ఎస్వీబీసీకి మొయిల్ చేశాడు. ప్ర‌తిగా భక్తుడికి ఎస్వీబీసీ ఉద్యోగి పోర్న్‌ సైట్‌ లింక్ పంపాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన భక్తుడు టీడీడీ చైర్మన్‌, ఈవోకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి‌, ఈవో జవహర్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు.

వెంటనే టీటీడీ విజిలెన్స్‌, సైబర్‌ క్రైం అధికారులు ఎస్వీబీసీ ఆఫీసులో తనిఖీలు చేశారు. పోర్న్ లింక్‌ పంపిన ఉద్యోగితో పాటు.. కార్యాలయంలో పోర్న్‌సైట్లు చూస్తున్న మ‌రో ఐదుగురు ఉద్యోగుల్ని సైబర్‌ క్రైమ్‌ టీమ్‌ గుర్తించింది. అలాగే విధులు నిర్వర్తించకుండా ఇతర వీడియోలు చూస్తున్నమరో 25 మంది సిబ్బందిని అధికారులు గుర్తించారు. దీంతో ఎస్వీబీసీ యంత్రాంగం ఉద్యోగులపై చర్యలకు సిద్ధమవుతున్నారు.


Next Story