పాక్‌ ప్రధాని ముందే ఉగ్రవాదంపై వార్నింగ్ ఇచ్చిన ప్రధాని మోదీ

ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఎలాంటి ద్వంద్వ ప్రమాణాలు ఉండొద్దని చెప్పారు ప్రధాని మోదీ.

By Srikanth Gundamalla  Published on  4 July 2023 12:04 PM GMT
PM Modi, Warn, Terrorism, Pakistan, SCO Summit,

పాక్‌ ప్రధాని ముందే ఉగ్రవాదంపై వార్నింగ్ ఇచ్చిన ప్రధాని మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఎస్‌సీవో సమ్మిట్ జరిగింది. వర్చువల్‌గా జరిగిన ఈ సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్‌ షరిఫ్‌లతో పాటు ఇతర సభ్య దేశాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదం గురించి మాట్లాడారు. ఉగ్రవాదానికి మూలమైన దాయాది దేశం పాకిస్థాన్‌పై విరుచుకుపడ్డారు. పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ముందే పరోక్షంగా ధ్వజమెత్తారు.

ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఎలాంటి ద్వంద్వ ప్రమాణాలు ఉండొద్దని చెప్పారు. భౌగోళిక వివాదాలు, ఉద్రిక్తతలు, మహమ్మారులతో అనేక దేశాలు పోరాడుతున్నాయని అన్నారు. కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని తమ విదేశాంగ విధానంలో భాగంగా మార్చుకుంటున్నాయని విమర్శించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చడం వంటివి చేస్తున్నాయని మండిపడ్డారు. ఇలాంటి వారిని నిరోధించేందుకు నిర్ణయాత్మక చర్యలు అవసరమని చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న దేశాలను విమర్శించడంలో ఎస్‌సీవో కూటమి ఎప్పుడూ వెనకాడొద్దని పిలుపునిచ్చారు. ప్రాంతీయ, ప్రపంచ శాంతికి ఉగ్రవాదం పెను ముప్పుగా మారిందని చెప్పారు. ఉగ్రవాదంపై కలిసికట్టుగా పోరాడి.. కనుమరుగయ్యేలా చూడాలని ఇతర దేశాలకు పిలుపునిచ్చారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. కోవిడ్ తర్వాత పరిస్థితులు చాలా ప్రాంతాల్లో దయనీయంగా మారయన్నారు. ఇప్పుడు ఆ దేశాలకు ఆహారం, ఇంధనం, ఎరువుల కొరత ప్రధాన సమస్యగా మారిందని చెప్పారు. మనమంతా ఒకే కుటుంబమని, పరస్పరం గౌరవించుకుని సహకారం అందించుకోవాలని ప్రధాని మోదీ కోరారు.

Next Story