పీయం కేర్స్ ఫర్ చిల్డ్రన్ ప్రారంభించిన ప్రధాని మోది
By - Nellutla Kavitha | Published on 30 May 2022 10:30 AM GMTకరోనా కారణంగా తల్లిదండ్రులను, సంరక్షకులను కోల్పోయిన చిన్నారుల కోసం ప్రధానమంత్రి కేర్ పథకానికి శ్రీకారం చుట్టారు నరేంద్ర మోడీ. పీఎం కేర్ ఫర్ చిల్డ్రన్ పథకం ద్వారా కరోనా సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు సహాయం చేయనున్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో తనకు తెలుసునని అన్నారు మోడి. ఒక కుటుంబ సభ్యుడిగా ఇదంతా చేస్తున్నాను అన్నారాయన.
పీఎం కేర్ ఫర్ చిల్డ్రన్ పథకానికి మోడీ శ్రీకారం చుట్టారు. దీనిద్వారా అనాధ పిల్లలకు ఆర్థిక సాయం అందజేయనున్నారు. ఈ పథకం కింద 4345 మంది పిల్లలను దత్తత తీసుకున్నారు. వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు కేంద్రం అండగా ఉండనుంది. 18 ఏళ్ల లోపు వారందరికీ పది లక్షల రూపాయల డిపాజిట్ చేస్తున్నారు. 18 నుంచి 23 ఏళ్లు వచ్చేవరకూ ప్రతినెల స్టైఫండ్ ఇవ్వడంతో పాటుగా, 23 ఏళ్లు వచ్చే వరకు వారి బాధ్యతను భారత ప్రభుత్వమే తీసుకోబోతోంది.
దేశంలోని ప్రతి ఒక్కరూ ఈ పిల్లలకు అండగా ఉన్నారని, అందుకు పీఎం కేర్ ఫర్ చిల్డ్రన్ భరోసా కల్పించడమే లక్ష్యంగా దీనిని ప్రారంభించారు. పీయం కేర్స్ ద్వారా ఆయుష్మాన్ భవ హెల్త్ కార్డ్ అందజేస్తారు. దాని ద్వారా ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందుతుంది.