మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడ్డారు. ఆచార్య సినిమా షూటింగ్‌లో భాగంగా కరోనా పరీక్షలు నిర్వహించుకోగా, పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఆచార్య మూవీ షూటింగ్ ప్రారంభించాలని కోవిడ్ పరీక్ష్‌లు చేయించుకున్నారు. నాకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవు.. వెంటనే హోం క్వారంటైన్ అయ్యాను. గత నాలుగైదు రజులుగా నన్ను కలిసిన వారందరిని పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియజేస్తానని చిరంజీవి అన్నారు.
మెగాస్టార్ చిరంజీవి సోదరుడు పవన్ కల్యాణ్ ఈ విషయంపై స్పందించారు. అన్నయ్య చిరంజీవి కరోనా బారినపడటంతో తామంతా విస్తుపోయామని.. అన్నయ్య సత్వరమే కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని తెలిపారు. లాక్‌డౌన్ ప్రకటించినప్పటి నుంచి అన్నయ్య ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని.. ప్రతి ఒక్కరిలో చైతన్యం కలిగించేలా సామాజిక బాధ్యతగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారని పవన్ తెలిపారు.
ప్రజారోగ్యంపై ఎంతో అవగాహన ఉన్న చిరంజీవి గారు తన ఆరోగ్యం పట్లా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఆయన కూడా మహమ్మారి బారిన పడ్డారు. ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. పరీక్షల్లో మాత్రం పాజిటివ్ అని తేలిందని అన్నారు. అన్నయ్య వీలైనంత త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నానని తెలిపారు