రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
By - Nellutla Kavitha |
ఏపీ, తెలంగాణ సహా 15 రాష్ట్రాల్లో 57 రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇందుకోసం 24 మే నోటిఫికేషన్ విడుదలలుతుంది. నావినేషన్ల పరిశీలన జూన్ 1 జరిగితే, ఉపసంహరణకు జూన్ 3 గడువు. ఇక జూన్ 10 న ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు జరుగనున్నాయి. అదే రోజు కౌంటింగ్ జరుగుతుంది.
అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుంచి 11 స్థానాలకు, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో ఆరు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇక ఏపి నుంచి 4 రాజ్యసభ స్థానాలకు, తెలంగాణ నుంచి 2 స్థానాలకు నోటిఫికేషన్ విడుదలయింది. తెలంగాణ నుంచి కెప్టెన్ లక్ష్మీకాంతరావు, డి. శ్రీనివాస్, ఆంధ్ర ప్రదేశ్ నుంచి విజయసాయి రెడ్డి, సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్, సురేష్ ప్రభు రాజ్యసభ సభ్యులుగా పదవి విరమణ చేస్తున్నారు. అయితే అప్పుడే ఆశావహుల్లో సందడి మొదలైంది. డీఏస్ టీఆరెస్ రెబల్ గా మారినందున ఆ స్థానం ఎవరితో భర్తీ చేస్తారనేది ఆసక్తిగా మారింది. ఇక ఏపీ లోను సిట్టింగ్ లు ఎంతమంది ఉంటారు, బయటి రాష్ట్రాలవారికి ఏదైనా అవకాశం ఉంటుందా అనే చర్చ జరుగుతోందిపుడు.